టాలీవుడ్ అగ్ర హీరోలు అయిన జూనియర్ ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ లతో మల్టీస్టారర్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమానే RRR. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.అల్లూరిగా, చెర్రీ... కొమురం భీంగా తారక్ నటిస్తున్నాడు.ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్, చరణ్ తాలూకు ఇంట్రో వీడియో లకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ లభించింది. ఇక నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఎన్టీఆర్ పాత్ర కు సంబంధించిన టీజర్ ఇటీవల అక్టోబర్ 22 న కొమురం భీం జయంతి సందర్భంగా విడుదల చేసింది మూవీ యూనిట్.ఈ టీజర్ కి ఆల్ ఓవర్ ఇండియా నుంచి ట్రెమండరస్ రెస్పాన్స్ వస్తోంది.

 ఇక ఇదిలా ఉంటె  ఎన్టీఆర్ టీజర్ - భీమ్ ఇంట్రో వీడియో ఒక ఫైట్ విషయంలో పూర్తి స్పష్టత ఇచ్చింది. ఎన్టీఆర్ బీస్ట్ మోడ్ లో కనిపించనున్నాడు. సినిమా కోసం మజిల్డ్ బాడీ బిల్డ్ చేశాడు. అంతకంటే ఆసక్తికరమైన అంశమేమిటంటే... బేర్ బాడీతో అడవి పులి తో పోరాడే ఫైట్! అవును... 'ఆర్ఆర్ఆర్' టీజర్ ద్వారా పులితో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గొండు బెబ్బులిగా పోరాడతాడని ఫుల్ క్లారిటీ వచ్చింది. దాంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. టీజర్లో 53 సెకన్ల దగ్గర ఎన్టీఆర్ బేర్ బాడీ చూపించాడు. బలంగా రెండు చేతులతో ఏదో లాగుతూ లింక్ కలపడానికి ప్రయత్నించాడు.అప్పుడు అక్కడ అతడి ఛాతీపై పులి పంజా వల్ల అయిన గాయం కనిపించింది.

 సరిగ్గా గుండెల మీద మూడు గాట్లు ఉన్నాయి. దీంతో పులితో ఎన్టీఆర్ ఫైట్ కన్ఫర్మ్ అని క్లారిటీ వచ్చింది.ప్రస్తుతం యూట్యూబ్ లో 'రామరాజు ఫర్ భీమ్' టీజర్ టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. సుమారు 13 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. అంటే ఇప్పటికి కోటీ 30 లక్షల మంది ఈ టీజర్ చూశారు అన్నమాట.మొత్తానికి కొమురం బీమ్ టీజర్ తో మరోసారి రాజమౌళి తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించడానే చెప్పాలి.ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుండి మొదలు కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: