మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటికి సూపర్ ఫాంలో ఉంది. హీరోయిన్ గా 15 ఏళ్ళ కెరియర్ లో అమ్మడు సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. సీనియర్ స్టార్స్ తోనే కాదు యువ హీరోలతో కూడా అమ్మడు జోడీ కడుతూ సత్తా చాటుతుంది. ఇక లేటెస్ట్ గా తమన్నా అహా ఓటిటి కోసం క్రేజీ డీల్ సెట్ చేసుకుందని తెలిసిందే. ఆహా కోసం సెలబ్రిటీ టాక్ షో ఒకటి ప్లాన్ చేశారు. దానికి తమన్నా హోస్ట్ గా వ్యవహరిస్తుంది. ఈ టాక్ షో రెగ్యులర్ షోలకు భిన్నంగా ప్లాన్ చేశారని తెలుస్తుంది. స్టార్స్ సీక్రెట్స్ గురించి తమన్నా అడిగి తెలుసుకుంటుందట.

అయితే ఇప్పటికే ఈ టాక్ షో మొదటి ఎపిసోడ్ కు రంగం సిద్ధమయ్యిందని తెలుస్తుంది. రానా, మిహీక బజాజ్ లతో ఈ టాక్ షో మొదలవుతుందని టాక్. మొదటి ఇంటర్య్వూ వారితోనే స్టార్ట్ చేస్తున్నారని టాక్. అసలు వీరిద్దరు ఎప్పుడు కలిశారు. ఎలా ప్రేమలో పడ్డారు. ముందు ఎవరు లవ్ ప్రపోజ్ చేశారు లాంటి విషయాలతో ఈ టాక్ షో నడుస్తుంది. పెళ్లి తర్వాత రానా, మిహీకలు ఇచ్చే తొలి ఇంటర్వ్యూ ఇదే అని చెప్పొచ్చు.

ఇక ఈ టాక్ షో కోసం తమన్నా భారీ డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. ఎపిసోడ్ కు 7 లక్షల దాకా తీసుకుంటుందట ఈ అమ్మడు. తమన్నా తన సత్తా చాటేలా ఈ షో ఉంటుందని తెలుస్తుంది. తప్పకుండా అందరి అంచనాలను అందుకునేలా ఈ టాక్ షో ఉంటుందట. తెలుగు ఓటిటి విభాగంలో ఆహా సరికొత్త సంచలనాలు సృష్టించాలని చూస్తుంది. మరి అమ్మడి టాక్ షో ఎలా ఉంటుందో చూడాలి.                                          

మరింత సమాచారం తెలుసుకోండి: