ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మానవాళికి ఎన్నో గుణపాఠాలు నేర్పిందనే చెప్పుకోవచ్చు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించేలా చేసింది. ఒంటికే కాదు చేతులు కూడా శుభ్రం చేసుకోవాలని తెలియపర్చింది. ఉరుకుల పరుగుల జీవితంలో రోజూ ఎంతో మందిని కలుస్తుంటాం.. ఎన్నో వస్తువులను తాకుతుంటాం.. దీంతో చేతులపై అనేక క్రిములు చేరుతాయి. చేతులు శుభ్రం చేసుకోకుండా ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆ క్రిములు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఫలితంగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముంది.

కరోనా నేర్పిన గుణపాఠం కూడా ఇదే.. చేతులను శుభ్రం చేసుకోవడం, దగ్గు, జలుబు వచ్చిన వ్యక్తుల నుంచి దూరంగా ఉంటే ఆరోగ్యంగా ఉండొచ్చని ఇప్పటికే చాలా మంది సినీ తారలు తెలిపారు. కరోనా జాగ్రత్తలు వీరు పాటిస్తూ.. తమ అభిమానులు కూడా పాటించాలని కోరుతున్నారు.

చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతే ఏ పనైనా స్టార్ట్ చేస్తా. షూటింగ్స్ లో పాల్గొన్నప్పుడు గ్యాప్ దొరికిన ప్రతిసారి చేతులు శుభ్రం చేసుకుంటుంటా. ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు, షూటింగ్ స్పాట్ లలో, హ్యాండ్స్ అవకాశాన్ని బట్టి సబ్బులతో చేతులు శుభ్రం చేసుకుంటా. మీరు కూడా చేతులు శుభ్రం చేసుకుని కరోనా నుంచి అప్రమత్తంగా ఉండండి రాశీ ఖన్నా, సినీ నటి.

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ఎవ్వరినీ పెద్దగా కలిసింది లేదు. కలిసిన సామాజిక దూరం పాటించేదాన్ని. ఇంట్లో ఉన్నప్పుడు హ్యాండ్ వాష్, సోప్స్ ని ఉపయోగిస్తా. బయటికి వెళ్లినప్పుడు శానిటైజర్ ను వెంట పట్టుకెళ్తా. మన వల్ల ఇతరులకు నష్టం కలగకుండా జాగ్రత్తగా ఉండాలి సిమ్రన్ చౌదరి, సినీ నటి.

తెలుగు సినీ ప్రముఖులు కరోనాపై పోరాటం చేయాలంటూ పాటలు పాడుతూ.. స్టెప్పులు వేశారు. సంగీత దర్శకుడు కోఠి సారధ్యంలో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కలిసి ‘లెట్స్ ఫైట్ దిస్ వైరస్.. లెట్స్ కిల్ దిస్ వైరస్’ పాటను రూపొందించారు. ఈ పాటలో చేతులు శుభ్రం చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని చిరంజీవి, నాగార్జున, వరుణ్ సందేశ్, సాయిధరమ్ తేజ్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: