ఆర్.ఆర్.ఆర్ సినిమా నుండి ఎన్టీఆర్ పోషిస్తున్న కొమరం భీం పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ మొన్న విడుదలైన విషయం తెలిసిందే. బాహుబలి లాంటి భారీ చిత్రం అందించిన రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడంతో సోషల్ మీడియా దృష్టి మొత్తం ఈ టీజర్ మీదనే ఉందనేది కాదనలేని వాస్తవం. అనుకున్నట్లుగానే విడుదల అయిన అతి తక్కువ సమయంలోనే ఈ టీజర్ రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోయింది. అయితే ఈ టీజర్ అంతా ఒక ఎత్తు అయితే తారక్ ముస్లిం వేషధారణలో కనపడడం ఒక ఎత్తు. ఇప్పుడు ముఖ్యంగా ఈ విషయమే హాట్ టాపిక్ అయింది.

కొమురం భీం పాత్రను చేయిస్తున్నానని చెబుతున్న రాజమౌళి కొమరం భీమ్ కి ఏ మాత్రం సంబంధం లేని పాత్రను సృష్టించాడని అన్ని వర్గాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే కొమురం భీమ్ కు తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ప్రముఖ స్థానం ఉంది. నిజాం పాలనకు, రజాకార్ల అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజన వీరుడుగా ఆయన్ని చాల మంది కొలుస్తుంటారు. అలాంటి భీమ్ నిజాం నిరంకుశ పాలనపై పోరాడితే ఆయన్ను ముస్లిం వేషధారణలో చూపడం ఏమిటని ఇప్పుడు జక్కన్న మీద ఫైర్ అవుతున్నారు.

కల్పిత కథ అంటూ చరిత్రను వక్రీకరిస్తున్నారా ? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అయితే జక్కన్న సపోర్తర్స్ ఏమో విడుదలైంది కేవలం టీజరే నని అసలు సినిమా చూస్తే తప్ప  భీమ్ పాత్ర ముస్లిం దుస్తుల్లో కనిపించడం ఎందుకో తెలుస్తుందని అంటున్నారు. అయితే ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి లాంటి తక్కువ మందికి తెలిసిన యోధుడి కధను కూడా జాగ్రత్తగా తెరకెక్కించిన మన దర్శకులు ఈ విషయంలో వక్రీకరించే ప్రయత్నం చేస్తారని అనుకోలేము.

మరింత సమాచారం తెలుసుకోండి: