లక్కీ హీరోయిన్ రష్మిక మందన్న పేరు చెప్పగానే మనకు డియర్ కామ్రేడ్, గీత గోవిందం సినిమాలు వెంటనే గుర్తుకొస్తాయి. లిల్లీ పాత్రలో ఆమె నటించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. అందం, అభినయం కలిగిన రష్మిక తన అభిమానులను వెనకేసుకు రావడం లో ముందుంటారు. తన అభిమానులకు నచ్చని పనులు ఎప్పుడూ చెయ్యనని కుండ బద్దలు కొట్టి మరీ చెబుతుంటారు. తన సినిమా విడుదల కాగానే అభిమానులు ఎలా స్పందించారు అనేది తెలుసుకోవడానికి తాను ఎక్కువగా తపన పడుతుంటారు.

అయితే అలాంటి రష్మికా ప్రస్తుతం తనని ఎవరో తొక్కేస్తున్నారు అన్నట్టు ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో ఒక సీతాకోక చిలుక రెక్కల ఎదుట గా రష్మిక మందన్న నిలుచొని సీతాకోక మాదిరి ఎగురుతున్నట్టు ఫోజ్ ఇచ్చారు. అయితే ఈ పోస్ట్ కి "మీరు నన్ను ప్రేమించినట్లయితే నా రెక్కలను కట్టేయకండి.. నన్ను స్వేచ్ఛగా ఎగరనివ్వండి" అని ఒక టాగ్ యాడ్ చేశారు. దీంతో ప్రస్తుతం రష్మిక మందాన స్వతంత్రంగా నడుచుకో లేక పోతుందా అన్న అనుమానాలు అభిమానుల్లో కలిగాయి. ఆమెను ఎవరూ ఆపుతున్నారు అని కూడా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ అభిమానులు ఆమెను కొన్ని సినిమాల్లో నటించడాన్ని ఇష్టపడటం లేదా అని కూడా కొందరు చర్చించుకుంటున్నారు.
ఇదిలా ఉండగా ముద్దుగుమ్మ రాశి ఖన్నా ఈ ఫోటో పై కామెంట్ చేశారు. ఈ ఫోటో చాలా బాగుంది అని ఒక హార్ట్ సింబల్ పోస్ట్ చేశారు.  కొంత మంది సెలబ్రెటీలు మాత్రం మీరు(రష్మిక) ఉన్నత స్థాయికి ఎదగ బోతున్నారు చింతించకండి అంటూ కామెంట్ చేశారు. ఇక పోతే ఈ ఫోటోకు 15 లక్షల లైకులు వచ్చాయి. పదివేల కామెంట్స్ వచ్చాయి. ఆమెను ఇంస్టాగ్రామ్ లో ఇప్పటివరకు కోటి మంది  అభిమానులు ఫాలో అవుతున్నారు. ఇప్పటి వరకు ఆమె అప్లోడ్ చేసింది కేవలం 300 పోస్టులు మాత్రమే కాగా.. ఒక కోటి అభిమానులను సంపాదించడం అనేది మామూలు విషయం కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: