స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో తెలిసిందే. తన వ్యక్తిగత, జీవితాలకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంటాడు. అలాగే తన పిల్లలకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను కూడా తరచుగా పోస్ట్ చేస్తుంటాడు.ఇప్పటికే బన్నీ తన పిల్లలకు సంబంధించిన ఎన్నో వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలలో షేర్ చేసి.. వాటిని తన అభిమానులతో పంచుకొంటూ వస్తున్నాడు..ఇప్పుడు మరోసారి బన్నీతాజాగా `ఫ్రైడే నైట్ డ్యాన్స్ పార్టీ` అంటూ పిల్లలు టీవీ చూస్తూ డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.ఈ వీడియోలో అయాన్, అర్హ లు టీవీ చూస్తూ డాన్స్ చేస్తూ ఉంటే... దానికి బన్నీ నవ్వుతూ ఆ సన్నివేశాల్ని వీడియో రూపంలో చిత్రీకరించి దాన్ని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు.


ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలలో ఎంతో వైరల్ గా మారింది.అయాన్, అర్హ ల క్యూట్ డాన్స్ మూమెంట్స్ కి బన్నీ ఫ్యాన్స్ తో పాటు.. నెటిజన్లు సైతం ఈ వీడియో చూసి మురిసిపోతున్నారు.ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` సినిమాలో నటిస్తున్నాడు బన్నీ.ఈ సినిమా పాన్ ఇండియా కేటగిరీలో రూపొందుతుంది.తెలుగు తో పాటు మరో నాలుగు భాషలలో ఈ సినిమా విడుదల కానుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడిగా రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నాడు.ఈ చిత్రం షూటింగ్ మొదలు పెట్టాలనుకున్న సమయంలో కరోనా మహమ్మారి విజృంభించడంతో షూటింగ్ ఆగిపోయింది. అయితే త్వరలోనే షూటింగ్ ప్రారంభించేందుకు సుకుమార్ రెడీ అయ్యాడు.నవంబర్ నెలలో ఈ సినిమా కొత్త షెడ్యుల్ ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమా కోసం బన్నీ ఓ డిఫరెంట్ మేకోవర్ ని ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వాటికి సంబంధించి బన్నీ లేటెస్ట్ లుక్స్ సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అయ్యాయి...!!


మరింత సమాచారం తెలుసుకోండి: