తెలుగు, తమిళ సినిమాల్లో రాణించే దర్శకులకు రెండు భాషల్లో మార్కెట్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ దర్శకులు కొందరికి తమిళ్ లో ఎంత మార్కెట్, సినిమా బిజినెస్, క్రేజ్ ఉందో తెలుగులో కూడా అదేస్థాయి క్రేజ్ ఉంది. గతంలో బాలచందర్, భారతీరాజా.. ఇప్పుడు మణిరత్నం, శంకర్, మురుగదాస్.. ఇలా కొందరు తెలుగులో కూడా ఫేమస్. వీరిలో మురుగదాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈక్రమంలో ఆయన తమిళ్ లో విజయ్ తో సినిమా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే.. ఆ సినిమా పట్టాలెక్కడం కష్టమేనంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.
తమిళ్ స్టార్ హీరో విజయ్ తో తుపాకి, కత్తి, సర్కార్.. వంటి సూపర్ హిట్స్ తీశాడు మురుగదాస్. అయితే.. నాలుగో సినిమా కూడా అనౌన్స్ చేశాడు. కానీ.. ఆ కథ విజయ్ కు నచ్చలేదని తెలుస్తోంది. వరుసగా మూడు హిట్లు ఇచ్చినా కథ బాగాలేదంటూ మురుగదాస్ కు చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇదే తరహాలో మురుగదాస్ తెలుగులో అల్లు అర్జున్ తో కూడా సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్టు కూడా ముందుకు వెళ్లే అవకాశాలు లేవని తెలుస్తోంది. మురుగదాస్ చెప్పిన కథ బన్నీకి నచ్చలేదని టాలీవుడ్ లో వార్తలు వచ్చాయి.

దీంతో మరుగదాస్ కు తెలుగు, తమిళ్ లో ఇద్దరు స్టార్ హీరోలు షాక్ ఇచ్చినట్టైంది. ప్రస్తుతం రెండు భాషల్లోనూ వైరల్ అయిన ఈ వార్తలపై అఫీషియల్ న్యూస్ రీవీల్ కావాల్సి ఉంది. మురుగదాస్ తెలుగులో డబ్బింగ్ సినిమాల ద్వారా బాగా పాపులర్. మెగాస్టార్ చిరంజీవితో ‘స్టాలిన్’ సినిమాను డైరక్ట్ గా తెలుగులోనే తెరకెక్కించారు. మరి నిజంగానే ఇద్దరు హీరోలు మురుగదాస్ కథలను రిజెక్ట్ చేశారా.. అసలు బన్నీని, విజయ్ ను కలిసి కథలు చెప్పారా అనే విషయాన్ని మురుగదాస్ చెప్పాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: