ఈ పేటకు నేనే మేస్త్రి.. పాటను తెలుగు మాస్ ఆడియన్స్ అంత త్వరగా మర్చిపోరు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా 17 జనవరి, 1993లో తెరకెక్కిన సినిమా 'ముఠామేస్త్రి.'  కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా, మినా మరియు రోజా హీరోయిన్లుగా తెలుగునాట దుమ్ము దులిపిన సినిమా ఇది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రధమ పాటగా వచ్చిన 'ఈ పేటకు నేనే మేస్త్రి' సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. కాగా ఈ సినిమాకు రాజ్ మరియు కోటి సంయుక్తంగా సింగీతాన్ని సమకూర్చారు.

ఈ సినిమాలో చిరు పాత్ర పేరు బోసు. దేశాన్ని ప్రేమించే సామాన్య యువకుని పాత్రలో నటించి మెప్పించారు మన మెగాస్టార్. ఇక అందాల ఒలకబోతలో నువ్వా నేనా అన్నట్టు నటించారు నటీమణులు మినా మరియు రోజా. అలాగే దేశభక్తి కలిగిన ఒక రిటైరైన తెలుగు మాస్టారుగా నటించారు మన సుప్రీం హీరో మామగారైన అల్లు రామలింగయ్య. అన్నీ సమపాళ్లలో కుదిరిన సినిమా ఇది. తెలుగు సినీ చరిత్రలో ఓ పేజీ ఈ సినిమా.

ఇకపోతే, మనకి మొదటి నుండి తెలుసు. మెగాస్టార్ తరువాత అతని వారసుడు ఆయన సినిమాలలోని కొన్ని పాటలను రీమేక్ చేస్తుండటం. అలా చేసినవే మగధీర లోని 'బంగారు కోడి పెట్ట' మరియు నాయక్ సినిమాలోని 'వాన వాన వెల్లువాయే.' ఈ రెండు పాటలూ తెలుగు సినీ ప్రేక్షకులను మైమరిపించేలా చేసాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వేసిన స్టెప్పులకు మెగా అభిమానులు ఫిదా అయిపోయారు.

అయితే, వాటి తరువాత రామ్ చరణ్ సినిమాలు విడుదలైనప్పటికీ మెగాస్టార్ పాటలను మాత్రం రీమేక్ చేయలేదు. కాగా.. మెగాస్టార్ వారసుడి కంటే మేనల్లుడు అయిన సాయి ధరమ్ తేజ్ తన మావయ్య పాటలను చాలానే రీమేక్ చేసాడు. అయితే అవి అనుకున్నంతగా అతగాడి సినిమాలకు ఎసెట్ కాలేకపోయాయి. ఇక తాజా సమాచారం మేరకు మరలా సాయి తన నెక్స్ట్ సినిమాలో మామ పాటను రీమేక్ చేయనున్నాడని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దానిపేరే 'ఈ పేటకు నేనే మేస్త్రి' పాట.

మరింత సమాచారం తెలుసుకోండి: