బిగ్ బాస్ హౌజ్ లో హోస్ట్ గా చేస్తున్న నాగార్జున ప్రస్తుతం ఆయన చేస్తున్న వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం మనాలికి వెళ్లారు. 21 రోజుల పాటు అక్కడ షూటింగ్ జరుపుకుంటారని తెలుస్తుంది. సోల్మన్ డైరక్షన్ లో తెరకెక్కే వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన ఇంపార్టెంట్ సీన్స్ అన్ని ఈ షెడ్యూల్ లో ప్లాన్ చేశారట.

ఇక బిగ్ బాస్ లో ఈ వారమే కాదు మరో రెండు వారాలు అంటే మొత్తం 3 వారాల దాకా నాగ్ కనిపించరని తెలుస్తుంది. నాగ్ బదులుగా అక్కినేని కోడలు సమంత హోస్ట్ గా చేస్తుందని తెలుస్తుంది. బిగ్ బాస్ హౌజ్ లో దసరా సందర్భంగా సమంత సందడి ఉంటుందని టాక్. అందుకే ఆదివారం 9 గంటలకు రావాల్సిన షో కాస్త సాయంత్రం ఆరు గంటలకే ఫిక్స్ చేశారు. దసరా రోజు స్టార్ మా ఆడియెన్స్ కు ప్రత్యేకంగా ఉండేలా బిగ్ బాస్ షోలో కూడా కొన్ని సర్ ప్రైజులు ప్లాన్ చేశారని తెలుస్తుంది.

షో హోస్ట్ గా సమంత చేయడమే ఓ సర్ ప్రైజ్ కాగా స్పెషల్ గా ఈ వారం నామినేషన్స్ ఉంటాయా లేదా అన్నది కూడా ఆసక్తిగా మారింది. అంతేకాదు షోలో సమంత ప్రత్యేకంగా కనిపిస్తుందని తెలుస్తుంది. సమంత క్రేజ్ ను వాడుకునేలా ప్రోగ్రాం ను సాయంత్రం 6 గంటలకే ఫిక్స్ చేశారు. తప్పకుండా బిగ్ బాస్ ఆడియెన్స్ కు ఈ పండుగ రోజు చాలా స్పెషల్ గా ఉంటుందని అనిపిస్తుంది.                                           



మరింత సమాచారం తెలుసుకోండి: