బిగ్ బాస్ సీజన్ 4లో ఈ శనివారం హోస్ట్ లేకుండానే షో నడుస్తుందా అంటే అవుననే అంటున్నారు. హౌజ్ లో రెండు రోజులుగా సినిమా టాస్క్ జరుగుతుంది. ఇందులో భాగంగా బిగ్ బాస్ బ్లాక్ బస్టర్ మూవీ తీశారు. ఈ శనివారం ఈ సినిమా ప్రీమియర్ జరుగనుంది. అంతెకాదు ఆ తర్వాత సినిమాకు అవార్డులు డ్యాన్సులు, కామెడీలు అదరగొట్టే కంటెంట్ తో ఈ శనివారం ఎపిసోడ్ వస్తుందని తెలుస్తుంది.

హోస్ట్ నాగ్ ఈ వీకెండ్ రానట్టే అని తెలుస్తుంది. ఆయన చేస్తున్న వైల్డ్ డాగ్ షూటింగ్ లో భాగంగా మూడు వారాల పాటు హోస్ట్ గా నాగార్జున మిస్ అవుతున్నారు. ఇక ఈ క్రమంలో ఆయన బదులుగా అక్కినేని కోడలు సమంత బిగ్ బాస్ హోస్ట్ గా రానుంది. సమంత బిగ్ బాస్ హోస్ట్ గా రావడంపై ఆడియెన్స్ లో ఆసక్తి మొదలైంది. తప్పకుండా ఆదివారం ఎపిసోడ్ సమంత అదరగొట్టేస్తుందని అంటున్నారు.

అయితే ఈ శనివారం, ఆదివారం జరగాల్సిన ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. దాదాపు ఈ వారం ఎలిమినేషన్ లేకుండానే చేస్తారని టాక్. రెండు వారాల క్రితం సుజాతతో పాటుగా గంగవ్వ హౌజ్ నుండి వెళ్లిపోయారు. కాబట్టి ఈ వారం ఎలిమినేషన్ ఉండదని టాక్. మరి ఈ శనివారం ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి. శనివారం హోస్ట్ లేకున్నా హౌజ్ మేట్స్ ఆట, పాటలతో షో సందడిగా సాగిందని చెప్పొచ్చు. ప్రోమో చూస్తుంటే దసరాకి జబర్దస్త్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా బిగ్ బాస్ రెడీ అయ్యింది.                                                            

మరింత సమాచారం తెలుసుకోండి: