అక్కినేని అఖిల్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మంచి రొమాంటిక్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇటీవల ఫస్ట్ లుక్ తో పాటు ఒక సాంగ్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా అవి ప్రేక్షకాభిమానుల నుండి మంచి స్పందన రాబట్టాయి. ఇకపోతే రేపు దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేయనుంది మూవీ యూనిట్. ఇప్పటికే దీనికి సంబంధించి రెండు రోజుల క్రితం ప్రీ లుక్ టీజర్ రిలీజ్ చేసిన మూవీ యూనిట్ దానికి మంచి స్పందన లభించిందని ఆనందం వ్యక్తం చేస్తోంది.

కాగా అఖిల్ ఈ సినిమాలో ఒక మధ్య తరగతి యువకుడి పాత్రలో నటిస్తుండగా ఆయనకు జోడీగా వరస విజయాల భామ పూజా హెగ్డే నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ కి చెందిన పలువురు ముఖ్య నటులు ఇతర పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కింగ్ అక్కినేని నాగార్జున తళుక్కున మెరవనున్నారట.

కాగా సినిమా మొత్తానికి ఎంతో కీలకమైన ఈ పాత్రలో నాగార్జున పర్ఫామెన్స్ వండర్ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఈ పాత్ర ఉన్నప్పటికీ కూడా నాగ్ కెరీర్లో ఈ రోల్ ఎప్పటికీ నిలిచిపోతుందని సమాచారం. ఇక తొలి సినిమా అఖిల్ తో రంగప్రవేశం చేసి కమర్షియల్ గా మంచి సక్సెస్ కోసం ఎప్పటినుండో ఎదురు చూస్తున్న అఖిల్ కు ఈ సినిమా భారీ విజయాన్ని అందించడం ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మరోవైపు అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి రేపు రిలీజ్ తర్వాత ఈ సినిమా ఎంతమేర సక్సెస్ ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొద్ది రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: