ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా రౌద్రం రణం రుధిరం. కాగా ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు తొలిసారిగా కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. అలియాభట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు ఈ ఇద్దరు హీరోల పాత్రల యొక్క ఇంట్రడక్షన్ టీజర్లు యూట్యూబ్ లో రిలీజ్ అయి భారీ స్థాయిలో రెస్పాన్స్  దక్కించుకుని సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, హాలీవుడ్ కు చెందిన పలువురు నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభం అవ్వగా అతి త్వరలో దీనికి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రారంభించించనుందట మూవీ యూనిట్. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ కు సంబంధించి ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాల్లో ఒక వార్త విస్తృతంగా ప్రచారం అవుతోంది. దాని ప్రకారం ఈ సినిమాని వచ్చే ఏడాది జూలైలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని అంటున్నారు. నిజానికి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా కారణంగా విధించబడిన లాక్ డౌన్ వలన మిగతా సినిమాలతో పాటు ఆర్ఆర్ఆర్ షూట్ కూడా నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే సంక్రాంతి సమయానికి సినిమా కంప్లీట్ కాదని కాగా దాని అనంతరం సమ్మర్ లో రిలీజ్ చేద్దామంటే అప్పటికే చాలా సినిమాలు రిలీజ్ ని ముందే ప్లాన్ చేసుకోవటంతో పక్కాగా జూలై అయితేనే కరెక్ట్ అని భావించిన దర్శకుడు రాజమౌళి ఆ నెలలోనే సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు.

ఒకవేళ ఇదేకనుక నిజమైతే ఈ సినిమా విషయమై రాజమౌళి తీసుకున్న నిర్ణయం సరైనది కాదని పలువురు అభిమానులు ప్రేక్షకులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిప్రాయపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమాని ఈ ఏడాది జులైలో రిలీజ్ చేస్తామని ఆర్ఆర్ఆర్ టీం గత ఏడాది ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ప్రస్తుతం ప్రచారమవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు గాని ఒకవేళ అదే కనుక నిజమైతే మాత్రం మరో తొమ్మిది నెలల వరకు ఆర్ఆర్ఆర్ మూవీ కోసం అభిమానులు ఎదురు చూడక తప్పదు

మరింత సమాచారం తెలుసుకోండి: