తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 కి టీఆర్పీ కోసం నిర్వాహకులు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికే టాస్క్‌ లని కూడా కొత్త కొత్తగా క్రియేట్ చేస్తున్నారు. అందుకే గెస్ట్‌ హోస్ట్‌ ని తెస్తున్నారు. అందులో భాగంగానే దసరా రోజు ప్రత్యేకంగా ఎపిసోడ్ ను డిజైన్‌ చేశారు. దానికి సమంత హోస్ట్‌గా రాబోతుందని ప్రకటన కూడా చేసేశారు. ఇక ఈ దెబ్బకు షోకు అదిరిపోయే రేటింగ్‌ రావడం ఖాయం అని నమ్మకంతో ఉన్నారు నిర్వాహకులు. అదీ కాక ఈ ఎపిసోడ్‌ ను ఏకంగా గంటల పాటు ప్లాన్ చేశారు.

 ఈ సాయంత్రం 6 గంటలకు ప్రత్యేకంగా షో ప్రారంభం కాబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే గట్టిగా ప్లాన్ చేశారు. ఎందుకంటే బిగ్ బాస్ హోస్ట్‌ గా చేస్తున్న నాగార్జున బిగ్ బాస్ కంటే ముందే కొన్ని సినిమాలు ఒప్పుకున్నాడు. అయితే కరోనా కారణంగా ఇన్నాళ్లు షూటింగ్స్‌ హాజరు కాని ఆయన ఇప్పడు షూటింగ్స్ కోసం బిజీ అయ్యారు.

నాగార్జున రెండు వారాలు బిగ్ బాస్ తెరపై కనిపించననే హింట్ ఇస్తూ నిన్న హిమాలయాల్లో ఉన్నానని ఒక వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం తాను మనాలీలో 'వైల్డ్ డాగ్' మూవీ షూటింగ్‌లో ఉన్నానని, కొన్నిరోజుల తర్వాత కలుద్దామని చెప్పారు.  ఈ నేపధ్యంలోనే సమంతాని ఫిక్స్ చేసి అనౌన్స్ చేసారు. ఇక ఈ టీఆర్పీ ప్లాన్స్ కోసం బిగ్ బాస్ అదే నండీ పెద్దోడు ప్లాన్స్ ఏమేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: