బిగ్ బాస్ హౌజ్ లో అఖిల్, అభిజిత్ ఇద్దరు ఒకరంటే ఒకరు పడని విధంగా నిన్న మొన్నటివరకు ఉన్నారు. అయితే అఖిల్ తన గేం ప్లాన్ మార్చేసి అభిజిత్ తో మళ్లీ మునుపటిలా మాట్లాడుతున్నాడు. అఖిల్ మాట్లాడుతున్నాడని అభిజిత్ కూడా మాట్లాడటం మొదలు పెట్టాడు. మధ్యలో మోనాల్ ఎంత డిస్ట్రబ్ చేసినా సరే అఖిల్, అభిజిత్ లు మళ్లీ ఇదివరకులా మాట్లాడుతున్నారు. అంతేకాదు బిగ్ బాస్ ఇచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా టాస్క్ లో భాగంగా అభిజిత్ డైరక్టర్ గా చేయగా.. అఖిల్ హీరోగా చేశాడు.

ఈ టాస్క్ లో అభిజిత్, అఖిల్ లు దగ్గరయ్యారని చెప్పొచ్చు. టాస్క్ లో భాగంగా మోనాల్ తో అభిజిత్ మాటలు కుదిరాయి. అయితే అభిజిత్, అఖిల్ ల మధ్య మాత్రం మళ్ళీ మంచి రిలేషన్ బిల్డ్ అవడం వారి అభిమానులకు హ్యాపీగా అనిపిస్తుంది. బిగ్ బాస్ హౌజ్ లో సినిమా చేస్తూ అఖిల్ ను డైరెక్ట్ చేసిన అభిజిత్ మొత్తానికి వారి మధ్య ఉన్న దూరాన్ని సెట్ రైట్ చేసుకున్నారు.

ఇక ఇప్పుడు ఆట మరింత రసవత్తరంగా మారుతుంది. ఇన్నాళ్లు వీరు దూరంగా ఉండటంతో మధ్యలో కొందరు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. కాని ఫైనల్ గా బిగ్ బాస్ లో ఎలాంటి గొడవలతో దూరమైనా మళ్లీ కలవడం కామనే అని మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇక ఈ వారం నుండి అభిజిత్ ను అఖిల్, అఖిల్ ను అభిజిత్ లు నామినేట్ చేసుకునే అవకాశం లేదని చెప్పొచ్చు.                                                                           

మరింత సమాచారం తెలుసుకోండి: