మహానటితో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం మిస్ ఇండియా అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. నరేంద్ర నాథ్ డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. నవంబర్ 4న ఈ సినిమా ఓటిటి రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేశారు.

ట్రైలర్ చూస్తే కీర్తి సురేష్ చాలా బక్కగా మారినట్టు తెలుస్తుంది. సినిమాలో ఆమె పాత్ర ప్రకారం అలా ఉండాలని అనుకుందో లేక కావాలని తగ్గిందో కాని మునుపటిలా కీర్తి సురేష్ లేదని మాత్రం అనిపిస్తుంది. అయితే ఆమెను అలా చూసి ఇష్టపడిన ఫ్యాన్స్ ఇలా బక్కగా మారినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఆమె తగ్గింది సినిమా కోసమా లేక పర్సనల్ గానా అన్నది పక్కన పెడితే బొద్దుగా ముద్దుగా ఉండే అమ్మడు ఇలా జీరో సైజ్ గా మారడం మాత్రం కొద్దిగా నిరుత్సాహపరచింది.

అఫ్కోర్స్ బొద్దుగా ఉంటే కొన్ని సినిమాల ఛాన్సులు వదుకోవాల్సి ఉంటుంది. ఇక మిస్ ఇండియా సినిమా విషయానికి వస్తే ఎం.బి.ఏ చేసి బిజినెస్ చేయాలని అనుకున్న ఓ అమ్మాయి జీవిత కథతో వస్తుంది. ఇండియా ఛాయ్ ను యూఎస్ కు పరిచయం చేస్తుంది హీరోయిన్. మొత్తానికి కీర్తి సురేష్ తన కొత్త సినిమాతో సర్ ప్రైజ్ ఇవ్వబోతుంది. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉంది. ఈ సినిమాతో పాటుగా కీర్తి సురేష్ నటించిన గుడ్ లక్ సఖి సినిమా కూడా రిలీజ్ కు రెడీగా ఉంది.                                                           

మరింత సమాచారం తెలుసుకోండి: