ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం రెడ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. కోలీవుడ్ లో సూపర్ హిట్టైన తడం రీమేక్ గా ఈ సినిమా వస్తుంది. కిశోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఓటిటి రిలీజ్ ఆఫర్ వచ్చినా కాదని థియేటర్ రిలీజ్ కే ఓకే చెప్పారు. ఇక లేటేస్ట్ గా ఈ సినిమా రిలీజ్ గురించి అఫీషియల్ అప్డేట్ వచ్చింది.

రామ్ రెడ్ సినిమా నుండి దసరా కానుకగా ఓ అప్డేట్ రాబోతుందని స్పెషల్ ట్వీట్ చేశారు చిత్రయూనిట్. రెడ్ సినిమాలో రాం డ్యుయల్ రోల్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు రామ్. మాళవిక శర్మ, నభా నటేష్, అమృత అయ్యర్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించారు.

మరి దసర సందర్భంగా రామ్ ఇచ్చే సర్ ప్రైజ్ ఏంటి సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేసారన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఏర్పడింది. ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకున్న రామ్ తన నెక్స్ట్ సినిమాలు జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. స్రవంతి రవికిశోర్ నిర్మాణంలో వస్తున్న రెడ్ సినిమాపై ప్రేక్షకుల్లో కూడా  మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలు అందుకునేలా సినిమా ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఆల్రెడీ తమిళంలో హిట్టైన సినిమా కాబట్టి తెలుగులో కూడా సేం రిజల్ట్ ఆశిస్తున్నారు.                                                                        




మరింత సమాచారం తెలుసుకోండి: