ప్రేమకథలు సినిమాకు ఎప్పుడూ క్రౌడ్ పుల్లర్సే. ఎప్పటికీ బోర్ కొట్టని కంటెంట్ ఉండేది ప్రేమకథల్లోనే. ఎంత అందంగా.. ఎంత కొత్తగా తెరకెక్కిస్తే ప్రేక్షకులకు అంత కిక్కు ఇస్తాయి లవ్ స్టోరీస్. వాటిలో హ్యాపీ ఎండింగ్ ఉన్నాయి.. ట్రాజెడిక్ ఎండింగ్ కూడా ఉన్నాయి. ఈతరహా సినిమాలెన్నో గతంలో వచ్చాయి.. ఇప్పటికీ తెరకెక్కుతున్నాయి. ఈకోవలో రీసెంట్ గా వచ్చిన సినిమానే ‘కలర్ ఫొటో’. సుహాస్, చాందినీ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా ఆహా ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకులతోపాటు సినీ సెలబ్రిటీల నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి.

హీరో నాని.. ‘కలర్ ఫొటో’.. చిట్టి ముత్యం ఈ సినిమా.. కాదని ఎవరన్నా అంటే.. అంటూ సినిమాపై తన అభిమానం చూపించాడు. దీనికి ఓ లవ్ సింబల్ కూడా యాడ్ చేశాడు. మంచు మనోజ్.. ‘సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. టీమ్ కు శుభాకాంక్షలు’ అని మెసేజ్ చేశాడు. హీరోయిన్ ఈషా రెబ్బా.. ‘అందమైన సినిమా కలర్ ఫొటో. టీమ్ మొత్తానికి అభినందనలు’ అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. దర్శకుడు బాబీ.. ‘మంచి ప్రయత్నం చేశారు.. మంచి సినిమా తీశారు’ అన్నాడు. ఎస్ఎస్ కార్తికేయ.. ‘ఏడిపించేశావ్ కదా..’ అంటూ సినిమాను, హీరో సుహాస్ ను మెచ్చుకున్నాడు.


దర్శకుడు మారుతి స్పందిస్తూ.. ‘మంచి ఎమోషనల్ కంటెంట్. ప్రేక్షకులు మెచ్చే సినిమా కోసం ఎంతైనా ఖర్చు పెట్టొచ్చని నిరూపించారు’ అంటూ మెచ్చుకున్నాడు. ఇలా.. ఇండస్ట్రీ నుంచి కూడా సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. హృదయ కాలేయం.. సినిమా దర్శకుడు సాయి రాజేశ్ ఈ సినిమాకు కథను అందించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించాడు. సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎమోషనల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. కాళభైరవ సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: