తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది టాప్ హీరోయిన్లు ఉన్నారు. కానీ కొంతమంది మాత్రమే  అతి తక్కువ కాలంలో టాప్ పొజిషన్ కి వెళ్తారు, వాళ్లే ఎక్కకువ మంది అభిమానుల్ని సంపాదించుకుంటారు. అలాంటి హీరోయిన్లలో పాయల్ రాజపుత్ ఒకరు. మాములుగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు బరువు తగ్గడం, పెరగడం చేస్తుంటారు. సినిమాల్లో పాత్రలను బట్టి తమ శరీర బరువు ఉండేలా చూసుకుంటారు. అయితే హీరోయిన్ పాయల్ సడెన్ గా బరువు తగ్గడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆర్.ఎక్స్ 100 సినిమాతో కుర్రకారుని ఒక ఊపు ఊపింది పాయల్. తన నటనాఅభినయంతో అందర్నీ ఆకట్టుకుంది.


అయితే వరుస సినిమాలతో గ్లామర్ మీద కాస్త శ్రద్ద తగ్గినట్టు కనిపించీమధ్య. అయితే  నాలుగు రోజుల క్రితం పాయల్ పెట్టిన స్లిమ్ ఫిజిక్ ఫోటోలను చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు.
ఏంటి ఈ మార్పు ఉన్నట్టుండి అని పాయల్ ఫోటోలను షేర్ చేస్తున్నారు. నెల రోజుల్లో ఐదు కిలోలు తగ్గి అందరికీ షాకిచ్చింది ఈ బ్యూటీ. ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అంటే అమ్మడు ఎంత బాగా తయారైందో అర్ధం చేసుకోవచ్చు.
తక్కువ సమయంలో ఎలా బరువు తగ్గిందో కూడా చెప్పుకొచ్చింది.


ప్రతిరోజూ మధ్యాహ్నం ఒంటి గంట నుండి రాత్రి 8 గంటల మధ్య మాత్రమే ఆహారం తీసుకునేదట పాయల్. దీంతో పాటు వారంలో కొన్నిరోజులు ఉపవాసం కూడా చేసేదట. వీటితో పాటు యోగా, వ్యాయామం చేసి.. ముప్పై రోజుల్లో 63 కిలోల నుండి 58 కిలోలకు చేరుకున్నట్లు చెప్పుకొచ్చింది.అయితే అసలు బరువు తగ్గడానికి కారణాలేంటో చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. కేవలం ఓ క్యురేటర్ కోసమే కష్టపడి ఐదు కిలోలు తగ్గినట్లు తెలిపింది. అయితే దీని వెనుక ఉన్న కారణాన్ని కూడా చెప్పింది.  ఓ కన్నడ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారని.. ఆ సినిమా కోసమే బరువు తగ్గానని చెప్పారు. సినిమాలో పాత్రకు తగ్గట్టుగా సన్నగా ఉండాలి అని చెప్పడంతో ఈ రకంగా స్లిమ్ అయినట్టు చెప్పారు పాయల్. సినిమాలో తనది పేదరికంలో బతికే అమ్మాయి పాత్ర అని.. ఒక పాత్ర కోసం బరువు తగ్గడం ఇదే మొదటిసారి అంటూ తన వెయిట్ లాస్ వెనుక కారణాలను బయటపెట్టింది ఈ ఆర్.ఎక్స్ 100 భామ.

మరింత సమాచారం తెలుసుకోండి: