మాస్ సినిమా లకు పెటింది పేరు బోయపాటి శ్రీను.. అయన సినిమా ఫలితాలు ఎలా ఉన్నా మాస్ ప్రేక్షకులకు పండగ చేసుకునే సీన్స్ లు ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా బోయపాటి శ్రీను కు వినయ విధేయ రామ రూపంలో పెద్ద షాక్ తగిలిందని చెప్పొచ్చు.. మెగా ఫాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన సినిమా అయినా ఇది కొంచెం కూడా వారికి నచ్చే విధంగా లేకపోవడంతో ఆ తప్పంతా బోయపాటి మీద నెట్టేసి ఆయనను తెగ విమర్శించారు.. సినిమా సంగతి ఎలా ఉన్నా యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం అదిరిపోయాయని చెప్పొచ్చు..

సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మరీ బోయపాటి తనకు అచ్చి వచ్చిన బాలకృష్ణ తో సినిమా చేస్తున్నాడు..వీరి కాంబో లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమా లు సూపర్ హిట్ కాగా ఈ సినిమా పై కూడ మంచి అంచనాలున్నాయి.. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ సినిమా చేయబోతున్నాడు..  అయితే మెగా స్టార్ తో సినిమా చేయాలనే కోరిక ను ఇంకా తన మదిలోనే ఉంచుకున్నాడట బోయపాటి.. గతంలో ఈ కాంబినేష‌న్‌లో సినిమా చేస్తాన‌ని ఒక‌ప్పుడు అల్లు అర‌వింద్ కూడా ప్ర‌క‌టించారు. `సైరా` త‌ర‌వాత‌… ఈసినిమానే అనుకున్నారు.

కానీ వినయ విధేయ రామ ఫ్లాప్ వీరి కాంబో లో సినిమా ని ఆపేసింది.. పరిస్థితులు మారిపోయాకొర‌టాల ట్రాక్ రికార్డు బోయ‌పాటి కంటే బాగుండ‌డంతో… బోయ‌పాటి నుంచి కొర‌టాల‌కు షిఫ్ట్ అయిపోయాడు చిరు. ఆ త‌ర‌వాత కూడా చిరు చాలా ప్రాజెక్టులు ఒప్పుకున్నా, అందులో బోయ‌పాటి సినిమా లేదు. బోయ‌పాటి కూడా… బాల‌కృష్ణ ప్రాజెక్టుపై ఫోక‌స్ పెట్టాడు. అయితే చిరుపై మాత్రం ఆశ‌లు వ‌దులుకోలేదు. చిరుతో ఓసినిమా చేయాల‌ని ప్లాన్ వేస్తున్నాడు. ఇది వ‌ర‌కే చిరుకి ఓ లైన్ వినిపించాడు బోయ‌పాటి. దాంతోనే గీతా ఆర్ట్స్‌లో సినిమా చేద్దామ‌నుకున్నారు. ఇప్పుడు ఆలైన్ పై కూడా బోయ‌పాటి వ‌ర్క్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: