తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్రముఖ తెలుగు నిర్మాత లేఖ రాశారు.. కరోనా వల్ల గత ఐదు నెలల నుంచి సినీ ఇండస్ట్రీ లోని ప్రముఖులు, కార్మికులు చాలా నష్టపోయారు.. అయితే వారిని ఆదుకోవడానికి చాలా మంది ముందుకు వచ్చారు కానీ ప్రతి రోజూ సాయం అందించలేరు.. అది మీరు గమనించాలి..ఈ మేరకు థియేటర్స్ ఓపెన్ చేయాలని కోరారు..రాష్ట్రంలో థియేటర్లను తెరవకపోవడం వల్ల ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా 50 వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారని తెలిపారు. థియేటర్ లీజు ఓనర్లు కార్మికులకు 8 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని లేఖలో పేర్కొన్నారు..



థియేటర్ల వల్ల చాలా మంది బ్రతుకుతున్నారు.. మీరు ఈ విషయం పై సమగ్ర విచారణ చేపట్టి సినీ కార్మికులకు జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు..ఏపీలో థియేటర్లను తెరిచేందుకు ఇప్పటికే అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు నట్టి కుమార్. తెలంగాణలో కూడా ఇస్తే రెండు రాష్ట్రాల్లో ఒకే సారి విడుదల చేయడానికి వీలవుతుందని లేఖలో పేర్కొన్నారు.. ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొన్న కార్మికులకు ఇకనైనా కూడా వారి జీవితాల్లో కాస్త వెలుగును నింపాలని కోరారు..



గత ఏడు నెలల నుంచి సినిమా షూటింగ్ లు, థియేట‌ర్లు, మ‌ల్టీప్లెక్సులు అన్నీ బంద్ అయ్యాయి. కేంద్రం లాక్‌డౌన్ స‌డ‌లింపులు ఇచ్చినా.. సినిమా హాళ్లు ప్రారంభానికి నోచుకోలేదు. ఐదు నెల‌ల త‌ర్వాత ప్ర‌భుత్వాల షూటింగ్స్ చేసుకోవ‌డానికి కొన్ని విధివిధానాల‌ను రూపొందించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  ఈ మేరకు స్టార్స్ అందరూ కూడా సినిమా షూటింగ్ లలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. అయితే థియేటర్స్ ను కూడా అక్టోబర్ 15 న తెరవచ్చునని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కూడా థియేటర్ యాజమాన్యాలు ఖర్చులకు భయపడి ఓపెన్ చేయలేదు. ఈ విషయాన్ని మరో సారి పరిగణలోకి తీసుకొని విచారించాలని కోరారు.. ఈ విషయం పై కేసీఆర్ ఎలా స్పందిస్తాడో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: