బిగ్ బాస్ సీజన్ ఫోర్ తెలుగులో ఒక లెక్కన సాగుతోంది. ఇది అతి పెద్ద రియాలిటీ షో అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. హోస్ట్ గా నాగార్జున వీకెండ్స్ లో దుమ్ము దులిపే రేటింగ్స్ తెచ్చిపెడుతున్నారు. అటువంటిది దసరా పండుగ వేళ నాగార్జున డుమ్మా కొట్టేశారు. షూటింగ్ పేరిట ఆయన ఎక్కడో హిమాలయాల్లో ఉన్నారు. దాంతో అక్కినేని వారి కోడలు రంగంలోకి దిగింది. సమంత లో కొత్త కోణాన్ని అలా బిగ్ బాస్ వెలుగులోకి తెచ్చింది. నిజంగా హోస్ట్ చేయడం అంటే అది టఫ్ జాబ్. నాగార్జున సీనియర్ నటుడు పైగా అనుభవం ఉంది. కానీ సమంతా ఏం చేస్తుంది అనుకున్న వారందరికీ బిగ్ షాక్ ఇచ్చేసింది.

సమంతా బిగ్ బాస్ షోని తనదైన స్టైల్ లో నడిపించిందనడానికి  ప్రోమోస్ అతి పెద్ద సాక్ష్యం. దీనిని సంబంధించి వచ్చిన ప్రోమోస్ ఆడియన్స్ లో ఒక్కసారిగా ఇంటరెస్ట్ పెంచేశాయి. ఎంతలా అంటే బిగ్ బాస్ షో ఎపుడెపుడు చూద్దామా అనేంతలా.  సమంత రంగస్థలం సాంగ్ తో ఫుల్ ట్రెడిషనల్ లక్ష్మిగా బిగ్ బాస్ స్టేజ్  పైన  కనిపించి ఇటు ఆడియన్స్ ని అటు కంటెస్టెంట్లను కూడా ఒక్కసారిగా షాక్ కి గురి చేశారు.

ఇక నాగ్ వేసే పంచ్ లే అదుర్స్ అనుకుంటే సమంత దానికి మించిన పంచ్ లు వేస్తూ కంటెస్టెంట్లకు నోట మాట రాకుండా చేశారు. ఈ షో ప్రోమోస్ కే మంచి రేటింగ్ వచ్చిందంటనే అసలు షో ఎంతగా రేటింగ్స్ సొంతం చేసుకుంటుందో అన్నది చూడాల్సిందే. అక్కినేని వారి కోడలా మజాకా అన్నట్లుగా సమంతా బిగ్ బాస్ స్టేజ్ మీద తనదైన స్టైల్ లో అలరించారు. ఇక మరో రెండు వారాల వరకూ నాగార్జున షూటింగ్ నుంచి వచ్చే అవకాశాలు అయితే లేవు కాబట్టి సమంత కచ్చితంగా మూడు వారాలు హోస్ట్ చేయడం ఖాయం. దాంతో సీజన్ ఫోర్ కి ఎక్కడ లేని రేటింగ్స్ వచ్చిపడతాయని అంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: