తమిళ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ పై ఊహాగానాలు పెరిగిపోతున్నాయి.. మొన్నటి దాకా రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ పై రకరకాల వార్తలు రాగా వాటికి క్లారిటీ ఇచ్చేశారు రజినీకాంత్.. ఇక కాలంల హాసన్ కూడా పొలిటికల్ ఎంట్రీ పై తన అభిప్రాయాన్ని చెప్పాడు.. కానీ యంగ్ హీరో అయినా విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఏంటా అని కొంతమంది ఆశ్చర్యపోతున్నారు.. ప్రస్తుతం తమిళ్లో నెంబర్ వన్ హీరో గా కొనసాగుతున్న విజయ్ కి ప్రతి సినిమా సూపర్ హిట్ గ నిలిచింది.. ఈ టైం లో సినిమా చేయక పొలిటికల్ ఎంట్రీ ఏంటి అని అభిమానులు అంటున్నారు..

మరి కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడు లో జరుగుతున్న నేపథ్యంలో మరోసారి అధికారం దక్కించుకోవాలని పళని స్వామి అండ్ టీం ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు జైలునుంచి విడుదల కాబోతోన్న శశికళ...దినకరన్ తో కలిసి తమిళనాట చక్రం తిపపాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ లకు గ్లామర్ టచ్ ఇవ్వాలని అనుకుని తమకు అనుకూలంగా ఉన్న స్టార్ లను మచ్చిక చేసుకుంటున్నారు.. రజిని, కమల్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తామని చెప్పి రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించాలని అనుకుంటున్నారు..

ఈ నేపథ్యంలో విజయ్ పొలిటికల్ ఎంట్రీ పై కొంత ఆసక్తి నెలకొంది.. దక్షిణ తమిళనాడులోని మధురై దిండిగల్ తిరునల్వేలితో సహా పలు జిల్లాల్లో అభిమాన సంఘాల అధ్యక్షులతో విజయ్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ భేటీ సర్వత్రా చర్చనీయాంశమైంది. మరో వారం రోజుల పాటు విజయ్ వరుస భేటీలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక 27 ఏళ్లుగా నిర్విరామంగా సినిమాలు చేసి ప్రేక్షకులను ముఖ్యంగా తన అభిమానులను ఎంతగానో అలరించిన విజయ్  ఓ రికార్డు తృటిలో చేజారిపోయిందనే బాధ ఇప్పుడు అభిమానుల్లో ఉంది.. మాస్టర్ సినిమా ని పూర్తిగా పోస్ట్ పోన్ చేయడంతో ఈ రికార్డు చేజారిపోయింది.. వచ్చే సంక్రాంతికి వస్తుందా లేక 2021 వేసవికి వెళ్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషయంగా విజయ్ ఫ్యాన్స్ తెగబాధ పడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: