ఎలాంటి బాక్ గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో ఏదిగి నేచురల్‍ స్టార్‍ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నాని మీడియం రేంజ్‍ హీరోలలో నంబర్‍ వన్  స్థానికి ఎదిగాడు. ఇండస్ట్రీలో మినిమమ్‍ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్ననానికి  ఇటీవల ట్రాక్‍ రికార్డ్ మాత్రం ఏమంత గొప్పగా లేదు.


‘జెర్సీ’ మినహాయిస్తే నాని చేసిన సినిమాలేవీ కూడా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. దీనితో నాని సినిమాలను కొనుకున్న బయ్యర్లు పెద్దగా లాభపడటంలేదు. గతంలో నాని  తన సినిమాల బడ్జెట్‍ కు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండేవాడు అని అంటారు. తన నిర్మాతలు తన సినిమాల పై అనవసరపు ఖర్చులు పెట్టకుండా చూసుకునేవాడు అన్న కామెంట్స్ ఉన్నాయి.  


తన పారితోషికం పెరిగినా తన సినిమాలకు సంబంధించి కాస్ట్ ఆఫ్‍ ప్రొడక్షన్‍ పరంగా అన్ని సినిమాలు ఒకే రేంజ్‍లో ఉండేడట్టు చూసుకునేవాడట. కాని ఇప్పుడు నాని పూర్తిగా మారిపోవడంతో నాని సినిమాల పై బడ్జెట్‍ కంట్రోల్‍లో ఉండడం లేదు. ‘వి’ చిత్రానికి భారీగానే ఖర్చయింది. అంతకుముందు ‘గ్యాంగ్‍లీడర్‍’ ‘దేవదాస్‍’ చిత్రాలకు కూడా ఓవర్‍ బడ్జెట్‍ అయింది అన్న కామెంట్స్ ఉన్నాయి.


నాని నటించబోయే ‘శ్యామ్‍ సింగ రాయ్‍’ చిత్రానికి కూడా బడ్జెట్‍ నలభై కోట్లు పైగానే అవుతుందనే అంచనాలతో ఆ చిత్రాన్ని నిర్మించాలనుకున్న సూర్యదేవర నాగవంశీ ఇటీవలే తప్పుకున్నాడు అన్న వార్తలు వచ్చాయి. దీనితో ఈ చిత్రాన్ని నాని మరో నిర్మాత చేతుల్లో పెట్టాడు. కరోనా ఎఫెక్ట్ వల్ల సినిమా మార్కెట్‍ బాగా దెబ్బతిన్న నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరాన్ని నాని గుర్తించాలి అంటు అతడి నిర్మాతలు అభిప్రాయ పడుతున్నట్లు టాక్. నాని సినిమాలకు అయ్యే ఖర్చు పాతిక నుంచి ముప్పయ్‍ కోట్లు అయ్యేట్టు చూసుకుంటే అన్నీ సేఫ్‍ జోన్‍ లో ఉంటాయి అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం స్టార్‍ గా మరో మెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తున్న నాని తన మార్కెట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ గీత దాటకుండా జాగ్రత్తపడితే మంచిదని ఇండస్ట్రీలోని కొందరి అభిప్రాయం..


మరింత సమాచారం తెలుసుకోండి: