సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు మరో క్రేజీ అటెంప్ట్ చేస్తుంది. బిగ్ బాస్ హౌజ్ లో కింగ్ నాగార్జునకు బదులుగా హోస్ట్ గా ఆమె రాబోతుంది. చెప్పాలంటే మామ ప్లేస్ ను కోడలు ఆక్యుపై చేసిందన్నమాట. సమంతకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. అందుకే సమంత బిగ్ బాస్ హోస్ట్ అనగానే షో మీద మరింత ఆసక్తి పెరిగింది. బిగ్ బాస్ హోస్ట్ గా సమంత తన సత్తా చాటనుంది. సమంత తన టాలెంట్ తో బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తుంది.

దసరా స్పెషల్ ఎపిసోడ్ లో సమంత హోస్ట్ గా బిగ్ బాస్ రానుంది. నాగార్జున తను చేస్తున్న వైల్డ్ డాగ్ షూటింగ్ లో భాగంగా మనాలికి వెళ్లాడు. అక్కడే 21 రోజుల పాటు షూటింగ్ జరుగనుందట. అందుకే హోస్ట్ గా నాగ్ ప్లేస్ లో సమంత ప్రత్యక్షమయ్యింది. పెళ్లి తర్వాత కూడా సమంత ఏమాత్రం ఫాం కోల్పోకుండా తన స్టామినా చూపిస్తుంది. తెలుగులో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ తో బిగ్ బాస్ హోస్ట్ గా ప్రమోట్ అయ్యింది.

బిగ్ బాస్ సీజన్ 4 లో సమంత 3 వారాలు హోస్ట్ గా చేస్తుందని తెలుస్తుంది. ఇక ఆమె తనదైన స్టైల్ లో ఈ షో చేయనుంది. సమంతతో పెట్టుకుంటే మాములుగా ఉండదని చెబుతుంది. ఓ బేబీలో బేబీతో పెట్టుకుంటే మాములుగా ఉండదనే డైలాగ్ ను ఇలా వాడేసింది. మొత్తానికి ఈ దసరా స్పెషల్ ఎపిసోడ్ సమంత రాకతో మరింత కలర్ ఫుల్ గా మారుతుందని చెప్పొచ్చు. నాగార్జున బదులుగా సమంత హోస్ట్ గా చేస్తున్న ఈ దసరా స్పెషల్ ఎపిసోడ్ కచ్చితంగా రేటింగ్స్ లో కూడా అదరగొడుతుందని చెప్పొచ్చు.                          

మరింత సమాచారం తెలుసుకోండి: