మహేష్ బాబు సినిమాల విషయంలో స్పీడ్ బాగా తగ్గించేశారు. గతంలో మిగతా హీరోలతో పోటీపడి మరీ సినిమాలు చకచకా పూర్తి చేసిన మహేష్.. ఇప్పుడు నింపాదిగా ఏడాదికి ఒక్క సినిమా చేస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు విషయంలో స్పీడ్ అందుకున్నారని అనుకున్నా.. వెంటనే చప్పబడిపోయారు. ఇప్పుడు మహేష్ సినిమాలకంటే అడ్వర్టైజ్ మెంట్లపై ఎక్కువ కాన్సన్ ట్రేషన్ చేశారు. లాక్ డౌన్ కాలంలో కూడా మహేష్ యాడ్స్ షూటింగ్ తో బిజీగా మారిపోయాడు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ యాడ్స్ లో మహేష్ తర్వాతే ఎవరైనా. ఆఖరికి ఆడవారికోసం రూపొందించిన సంతూర్ యాడ్ లో కూడా మహేష్ బాబే కనిపిస్తున్నారంటే ఆయన క్రేజ్ అలా ఉంది మరి. సినిమా రెమ్యునరేషన్ తో పాటు యాడ్ రెమ్యునరేషన్లో కూడా మహేష్ ఇప్పుడు టాలీవుడ్ లో నెంబర్ 1. ఓ రకంగా చెప్పాలంటే బాలీవుడ్ హీరోలతో బ్రాండ్ ల విషయంలో పోటీపడుతున్నారు మహేష్. సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ రూపంలో మహేష్ భారీగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. కమర్షియల్ యాడ్ కి మహేష్ అందుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసా? 5 నుంచి 10 కోట్ల రూపాయలు.

థమ్స్ అప్... సంతూర్... బైజూస్... డెన్వర్ వంటి బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న మహేష్ ఏడాదికి గానూ దాదాపు 5 నుంచి 10 కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ మధ్య ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కి బ్రాండింగ్ చేస్తున్నారు మహేష్. దీనికి కూడా ఆయన భారీగానే డిమాండ్ చేస్తున్నారట. ప్రస్తుతం సినిమాల విషయంలో స్లోగా ఉన్నా.. అడ్వర్టైజ్ మెంట్ల విషయంలో మాత్రం మహేష్ దూసుకెళ్తున్నారు. లాక్ డౌన్ టైమ్ లో అందరూ కొత్త సినిమాల విషయంలో స్పీడ్ పెంచితే, మన ప్రిన్స్ మాత్రం ఈపాటికే మూడు అడ్వర్టైజ్ మెంట్లు పూర్తి చేశారు. సినిమాకోసం మాత్రం ఇంకా మేకప్ వేసుకోలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: