ప్రముఖ భారతీయ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ గర్భం ధరించిన సంగతి విధితమే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ దుబాయ్ దేశంలో జరుగుతుంది. కష్టం విరాట్ కోహ్లీ ప్రోత్సహించడానికి అనుష్క శర్మ దుబాయ్ లోనే ఉంటున్నారు. వారాలు గడిచిన కొద్దీ విరాట్ కోహ్లీ అనుష్క శర్మ బిడ్డ బయట ప్రపంచంలో అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నాడు. కడుపులో బిడ్డ పెరుగుతున్న కొద్దీ అనుష్కశర్మ తన వస్త్రధారణ శైలిని మారుస్తున్నారు. తాజాగా ఆమె తన సోషల్ మీడియా ఖాతాల వేదిక గా 3 ఫోటోలను షేర్ చేశారు. సూర్యరశ్మిలో పుష్కలంగా లభించే విటమిన్ డి పొందడానికి ఆమె బయటకు వచ్చే నిలబడి సూర్య భగవానుడు దర్శనం చేసుకున్నట్టు ఈ ఫోటోలో కనిపిస్తోంది.


ఈ ఫొటోలో అనుష్క సాల్మన్ పింక్ దుంగారీని ధరించారు. దానిపై ఆమె ఓ తెల్లటి టీ షర్టు ధరించారు.  దుంగారీ వస్త్రం ముందు భాగంలో బటన్ ఉండగా.. కింద భాగంలో  సైడ్ పాకెట్స్ ఉన్నాయి.  అనుష్క శర్మ ఎప్పుడూ కంఫర్ట్ స్టైలింగ్‌కి ప్రాధాన్యత ఇస్తారు. అలాగని తన ఫ్యాషన్ స్టైల్లో ఎటువంటి కొరత ఉండదు. ప్రస్తుతం గర్భం ధరించిన ఆమె తన ఫ్యాషన్ స్టైల్ ని మాత్రం వదిలిపెట్టలేదు. రబ్ నే బనా డి జోడి, పరి వంటి అత్యద్భుతమైన చిత్రాల్లో తన నటనా ప్రతిభను చూపి ప్రేక్షకులను వెండితెరకు కట్టిపడేసిన అనుష్క శర్మ ఇప్పటికీ చాలా అందంగా నే కనిపిస్తున్నారు. అప్పట్లో అనుష్క శర్మ లిప్ సర్జరీ చేయించుకున్నారని.. దాంతో ఆమె అందం కాస్త తగ్గిందని అభిమానులు అంటుంటారు. ఏది ఏమైనా అనుష్క శర్మ తల్లి కాబోతున్న వార్త అభిమానుల్లో సంతోషాలకు దారితీస్తుంది.


ఇక అసలు విషయానికి వస్తే అనుష్క శర్మ ధరించిన సాల్మన్ పింక్ దుంగారీ ధర అక్షరాలా 17 వేల 500 రూపాయలట. చూడటానికి డ్రస్సు చాలా సింపుల్ గా కనిపిస్తున్నప్పటికీ ధర పదిహేడు వేల రూపాయలు ఉండటం నిజంగా షాక్ కావాల్సిన విషయమే. పదిహేడు వేల రూపాయలతో ఒక మధ్యతరగతి కుటుంబం ఒక నెల బతకొచ్చు. ఒక రిఫ్రిజిరేటర్ కొనుక్కోవచ్చు. ఒక మంచి స్మార్ట్ ఫోన్ కూడా కొనుక్కోవచ్చు. కానీ ఒక నాలుగు రోజుల పాటు ధరించడానికి అనుష్కశర్మ 17 వేల రూపాయలు ఖర్చు పెట్టి దుంగారీ కొనుగోలు చేశారు. ఎంతైనా సెలబ్రిటీల జీవితం ఎంత లగ్జరీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: