నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య హీరోగా సెటిలవ్వడానికి పెద్దగా కష్టపడలేదు కానీ.. చిన్నకొడుకు అఖిల్ మాత్రం తెగ ఇబ్బంది పడిపోతున్నాడు. వర్సబెట్టి చేసిన మూడు సినిమాలు ఫ్లాప్ కావడంతో.. నాలుగో మూవీపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఇప్పటి వరకూ ఈ సినమాకి సంబంధించి బైటకు వచ్చిన మెటీరియల్ ఓ ఎత్తు అయితే... ఇప్పుడు అఖిల్ కొత్త మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ నుంచి వచ్చిన టీజర్ మరో ఎత్తు అనిపిస్తోంది. ఈ టీజర్ లో సరికొత్తగా కనిపిస్తున్నాడు అఖిల్.

ఇంతకీ ఈ టీజర్ లో విశేషం ఏంటి అనుకుంటున్నారా..? నాగార్జునను అఖిల్ ఫుల్లుగా ఇమిటేట్ చేయడమే ఈ టీజర్ ప్రత్యేకత. నిన్నే పెళ్లాడతా సినిమా టైమ్ లో నాగార్జున హావభావాలు ఎలా ఉండేవో.. సరిగ్గా ఇప్పుడు అఖిల్ అదే స్టైల్ ఫాలో అవుతున్నాడు. ఇన్నాళ్లూ తన సొంత మేనరిజమ్ తో వచ్చిన అఖిల్.. ఇప్పుడు నాగార్జునని పూర్తిగా ఇమిటేట్ చేయడం మొదలు పెట్టాడు. డైలాగ్ డెలివరీ నుంచి ఫేసియల్ ఎక్క్ ప్రెషన్స్, హ్యాండ్ మూమెంట్స్.. ఇలా అన్నిట్లో తండ్రిని గుర్తు చేస్తున్నాడు అఖిల్. హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ కాబోతోంది.

మూడు తప్పటడుగుల తర్వాత అఖిల్ నాలుగో ప్రయత్నంగా వస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పైనే అందరి ఆశలన్నీ ఉన్నాయి. అటు నాగార్జున .. ఇటు జీఏ2 బ్యాచ్ .. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ అందరికీ సవాల్ లాంటిదే ఈ ప్రయత్నం. అందుకే అఖిల్ అభిమానుల్లో.. టోటల్ అక్కినేని అభిమానుల్లో ఒకటే క్యూరియాసిటీ నెలకొంది. పోస్టర్లు టీజర్ ఆకట్టుకున్నట్టే మొత్తం సినిమా కూడా బ్లాక్ బస్టర్ అన్న టాక్ రావాలి మరి. 2021 సంక్రాంతికి వస్తామంటూ ఇప్పటికే టీజర్లో ప్రకటించేశారు కూడా. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫుల్ ట్రీట్ ఇవ్వాలనుకుంటున్న అఖిల్ సూపర్ సక్సెస్ అవుతారో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: