టాలీవుడ్ లో ప్రస్తుతం అగ్ర హీరోలు ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. అందుకే వారి సినిమాల విషయంలో ఎప్పుడూ నువ్వా నేనా అన్న పోటి అనేది అన్ని సోషల్ మీడియా ట్రెండ్స్ లో టీసర్ అండ్ ట్రైలర్ వ్యూస్ లైక్స్ విషయం లో ఉంటుంది.కానీ ప్రస్తుతానికి చరిత్ర సృష్టించింది మాత్రం తమిళంలో ఇళయ దళపతి విజయ్ అయితే ఇక్కడ మన తెలుగులో అది కేవలం ఎన్టీఆర్ అనే చెప్పాలి. సౌత్ మూవీస్ పరంగానే కాకుండా ఇండియా వైడ్ గా కూడా సినిమా టీసర్ ల విషయం లో మొట్ట మొదటి సారి 1 మిలియన్ లైక్స్ రికార్డ్ ను అందుకున్న హీరోగా..


ఇలయ దళపతి విజయ్ సంచలన రికార్డ్ ను 2017 లో మెర్సల్ సినిమా తో సొంతం చేసుకోగా మళ్ళీ తన రికార్డ్ ను తానె 2018 లో సర్కార్ సినిమా తో బ్రేక్ చేసి ఈ సారి కేవలం 24 గంటల్లోనే ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను సొంతం చేసుకోగా..ఇప్పుడు టీసర్ల విషయం లో ఎన్టీఆర్ కొమరం భీమ్ ఇంట్రో టీసర్ టాలీవుడ్ తరుపున మొట్ట మొదటి 1 మిలియన్స్ లైక్స్ ని సొంతం చేసుకున్న టీసర్ గా నిలవగా సౌత్ మూవీస్ పరంగా ఈ మార్క్ ని అందుకున్న మూడో టీసర్ గా నిలిచి సంచలనం సృష్టించింది. విజయ్ 2 సినిమాలతో టాప్ లో ఉండగా ఇప్పుడు ఎన్టీఆర్..1 టీసర్ తో ఉన్నాడు.


టోటల్ గా సౌత్ మొత్తం మీద కాకుండా ఇండియా లో కూడా 1 మిలియన్ లైక్స్ ఉన్న హీరోలలో ఇద్దరు సౌత్ హీరోలు నిలవడం విశేషం అని చెప్పాలి, దాంతో ఇక రానున్న టైం లో మిగిలిన హీరోల ఫ్యాన్స్ ఈ 1 మిలియన్ లైక్స్ పై స్పెషల్ దృష్టి పెట్ట బోతున్నారట.ఇక తెలుగులో ఎన్టీఆర్ సృష్టించిన ఈ రికార్డు ను రాబోయే రోజుల్లో ఏ అగ్ర హీరో బ్రేక్ చేస్తాడా అన్న ఆసక్తి ఇప్పుడు అందరిలో పెరిగిపోయిందని చెప్పొచ్చు... చూద్దాం మన యంగ్ టైగర్ ని బీట్ చేసే దమ్ము టాలీవుడ్ ఏ హీరోకి ఉందో...!!


మరింత సమాచారం తెలుసుకోండి: