విశాఖలో గీతమ్ యూనివర్సిటీ గోడల కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు కాబట్టే కూల్చేశామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ భూముల్ని గుర్తించి ఫెన్సింగ్‌ వేశారు. విశాఖలో ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ప్రస్తుతానికి బ్రేక్ పడింది. విశాఖ గీతం యూనివర్శిటీ  కట్టడాల కూల్చివేతపై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. సోమవారం వరకు యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. నిర్మాణాల తొలగింపుపై గీతం వర్సిటీ వేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ వేసింది. ముందస్తు నోటీసు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని పిటిషన్‌లో ఆరోపించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈ ఆదేశాలిచ్చింది.

అయితే ఇప్పటికే గీతం యూనివర్సిటీలో కూడా ప్రభుత్వ భూములు ఉన్నాయంటూ మెయిన్‌గేట్‌ తొలగించడంతో పాటు.. గోడలను కొంతమేర కూల్చివేశారు రెవెన్యూ అధికారులు. నిన్న తెల్లవారుజామునే మొదలైన ఈ ప్రక్రియ.. తీవ్ర వివాదానికి దారి తీసింది. రుషికొండ, ఎండాడ పరిధిలో ప్రభుత్వానికి చెందిన 40కిపైగా ఎకరాల్లో గీతం యాజమాన్యం అక్రమంగా నిర్మాణాలు చేపట్టిందని దీనికి సంబంధించి యాజమాన్యానికి సమాచారం ఇచ్చిన తర్వాతే చర్యలు తీసుకున్నామని అధికారులు చెప్పారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత తర్వాత.. ప్రభుత్వ భూముల హద్దుల్ని గుర్తించి, ఫెన్సింగ్‌ వేశారు అధికారులు.

అయితే కూల్చివేతల సమయంలో భారీగా పోలీసులను మోహరించడం, బీచ్‌ రోడ్డు వైపు ఎవర్నీ అనుమతించకపోవడంతో... గీతం యూనివర్సిటీలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ఏర్పడింది. అయితే ఈ గీతమ్ నిర్వాహకులు శ్రీ భరత్ స్వయానా బాలయ్య అల్లుడు కావడం చర్చనీయాంశంగా మారింది. జగన్ బాలయ్య ఫ్యాన్ అని, అందుకే ఆయన బాలయ్యని ఏమీ అనరని జరుగుతోన్న ప్రచారానికి బ్రేక్ వేసేందుకే ఈ చర్యలకి జగన్ సర్కార్ దిగిందని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి ఈ వ్యవహారం ఎందాక వెళ్తుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి: