మాస్ ఇమేజ్ లేకుండా సినిమాల్లో రాణించడం కత్తి మీద సామే. ఎందరో హీరోలు మాస్ ఇమేజ్ కోసం పరితపిస్తూ ఉంటారు. మాస్ ఇమేజ్ తో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోవచ్చు. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు వస్తాయి. ఇది ఎప్పటి నుంచో ఉన్న ఫార్ములానే. అయితే.. మాస్ ఇమేజ్ గురించి ఆలోచించకుండా మంచి సినిమాలతో, తనదైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేసిన తెలుగు హీరో ‘నాని’. కెరీర్ స్టార్టింగ్ నుంచి క్లాస్ కంటెంట్ మూవీస్ తో రాణిస్తున్నాడు. మినిమం గ్యారంటీ హీరోగా మారాడు. ప్రస్తుతం ఆయన తన స్టైల్ మార్చినట్టు తెలుస్తోంది.
దసరా పర్వదినాన తన కొత్త సినిమా అనౌన్స్ చేశాడు నాని. ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా పోస్టర్ రిలీజ్ చేశాడు. ఈ సినిమా చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించినా అఫిషియల్ పోస్టర్, క్యాస్టింగ్, టెక్నీషియన్స్, షూటింగ్ డిటైల్స్.. రిలీజ్ చేయడం ఇదే. సినిమాలో నాని లుక్ రఫ్ గా ఉంది. కోర మీసంతో ఉన్నాడు. కాళీ మాత, హౌరా బ్రిడ్జి.. ఈ పోస్టర్ లో చూపించారు. దీంతో ఈ సినిమాలో మాస్ కంటెంట్ ఉంటుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే నాని కొత్త జోనర్ లో సినిమా చేస్తున్నాడనే చెప్పాలి. నానితో ఎంసీఏ తర్వాత సాయి పల్లవి మరోసారి జోడీ కడుతోంది.

ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న కృతి శెట్టి మరో హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. గతంలో ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు బ్యానర్ మారింది. నిహారిక ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. టాక్సీవాలాతో సక్సెస్ కొట్టిన రాహుల్ సంకృత్యాన్ ఈ సినిమాకు దర్శకుడు. డిసెంబర్ లో షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: