తెలుగు లో బిగ్ బాస్ సీసన్4 విజయవంతంగా ఇప్పటికే ఆరు  వారాలు పూర్తి చేసుకుంది. ఇక  గత ఆరువారాలకి హోస్ట్‌గా ఉన్న నాగార్జున వైల్డ్ డాగ్ మూవీ షూటింగ్ కోసం మనాలీ వెళ్ళగా, ఆయన స్థానాన్ని కోడలు సమంత భర్తీ చేస్తుంది.

శనివారం ఎపిసోడ్ హోస్ట్ లేకుండా సాగిపోగా, ఆదివారం రోజు సమంత ఇంటి సభ్యలతో సందడి చేయనుంది. ఇప్పటికే బిగ్ బాస్ స్టేజ్‌పై సమంత చేసిన సందడికి సంబంధించి ప్రోమోలు విడుదల చేయగా, ఇవి సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.


దసరా సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు బిగ్ బాస్ కార్యక్రమం ప్రారంభం కానుంది. రాత్రి 9గం.ల వరకు ఈ షో ప్రసారం కానుండగా, మూడు గంటల పాటు సమంత హౌజ్‌మేట్స్‌తో చేసే సందడి ఏ రేంజ్‌లో ఉంటుందా అని ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు.ఇప్పటికే విడుదలైన బిగ్ బాస్ ప్రోమో లో సమంత తన వాక్చాతుర్యం తో ఇంట్లో ఉన్న సభ్యులందరినీ ఓ ఆట ఆడేసుకుందనే చెప్పాలి. కేవలం ప్రోమో లోనే ఎన్నో సర్ప్రైజ్ లను ప్లాన్ చేసిన టీం.. ఇక ఫుల్ ఎపిసోడ్ లో ఇంకెన్ని సర్ప్రైజ్ లను చూపిస్తారో అని బుల్లితెర ప్రేక్షకులు ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 


ఇక ఇదిలా ఉంటె  గత సీజన్‌లో కూడా నాగార్జున అందుబాటులో లేకపోవడం వలన రమ్యకృష్ణ రెండు ఎపిసోడ్‌లకు హోస్ట్‌గా వ్యవహరించింది. ఆ సమయంలో ఎలిమినేషన్ ప్రాసెస్‌ని తాత్కాలికంగా రద్దు చేశారు. మరి ఈ రోజు కూడా అలానే జరుగుతుందా?లేదా?అనే అంశం ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకుల్లో ఆసక్తి గా మారింది.అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు దసరా పండగ వేళ ఎలిమినేషన్ రద్దు చేయాలని బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.మరి ఇది నిజమా కాదా అనేది తెలియాలనంటే ఈ రోజు ఎపిసోడ్ ని అస్సలు మిస్సవ్వకండి...!!!

మరింత సమాచారం తెలుసుకోండి: