కాలం వేగంగా ముందుకే పరిగెడుతుంది. దానికి కఠినం అని మరో పేరు కూడా ఉంది. కాలంతో పాటే వచ్చే మార్పులూ చేర్పులూ ఎవరి ఊహలకు అందవు. మరి కొన్ని సార్లు అసలు ఒప్పుకోవడానికి కూడా మనసు రాదు. కానీ కాలం ఖర్మం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. తోలు బొమ్మలాట నుంచి సినిమా హాళ్ల దాకా సాగిన వినోద ప్రయాణాన్ని కరోనా సరికొత్త మలుపు తిప్పేసింది. దీనికి ముందు కూడా థియేటర్లు ఏం గొప్పగా వెలిగిపోవడంలేదు. సీజనల్ గానే అవి నిండుతున్నాయి.

అలా గుడ్డి కంటే మెల్లకన్ను బెటర్ అనుకుంటున్న సినిమా థియేటర్లను ఏకంగా గుడ్డి చేసేసింది కరోనా. సరిగ్గా ఏడు నెలలు పైదాటింది సినిమా హాళ్ళు మూతపడి. ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి సినిమా హాళ్ళు తెరచుకోమని చెప్పినా కూడా ఎవరూ ఆ సాహసం చేయలేదు. కొన్ని ఐ మాక్సులు ఓపేన్ చేసినా దారుణమైన షాక్ కొట్టింది. మొత్తం హాలుకు ముగ్గురు నలుగురు ఆడియన్స్ వచ్చి సినిమా చూశారు. ఇదే పరిస్థితే కొనసాగింతే సినిమా హాళ్ళు పూర్తిగా మూసుకోవాల్సిందేనని అంటున్నారు.

మరో వైపు ఓటీటీ ఫ్లాట్ ఫారం ఎక్కడా తగ్గడంలేదు. దూకుడు చేస్తోంది. దీతో సినీ అనలిస్టులు సరికొత్త లెక్కలు చెబుతున్నారు. భవిష్యత్తుని కూడా కళ్ల ముందు పెట్టి చూపిస్తునారు. 2024 నాటికి సినిమా హాళ్ళ ఆదాయం దారుణంగా పడిపోతుందని కొత్త న్యూస్ చెబుతున్నారు. దేశీయంగా చూసుకుటే థియేటర్ ఇండస్ట్రీ చాలా పెద్ద దెబ్బ తింటుందని కూడా అంటున్నారు. ఏకంగా 11,500 కోట్లకే దాని వాటా పడిపోతుందిట.

మరి అదే సయంలో ఓటీటీ వంటి ఫ్లాట్ ఫారాలు కళకళలాడతాయట. వాటి డిమాండ్ చాలా ఎక్కువగా పెరుగుతుంది అంటున్నారు. సినిమాను స్మార్ట్ ఫోన్ లో  చూసే వారి సంఖ్య కూడా చాలా అధికం అవుతుందిట. అంటే ప్రేక్షకుడు కూర్చున్న చోట నుంచి కదలకుండా వినోదాన్ని  అరచేత పెట్టేసే కల్చర్ బాగా దూసుకువస్తుందిట. ఇది కరోనా కారణంగా మొదలైనా కూడా ఫ్యూచర్ మాత్రం ఇదేనని సినీ అనలిస్టులు అంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: