అక్కినేని అఖిల్, పూజా హెగ్డే నటిస్తున్న మూవీ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్". గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మాణ సారధ్యంలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ టీజర్ ను దసరా సందర్భంగారిలీజ్ చేశారు. టీజర్ కు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే టీజర్ లో కొన్ని ఫ్రేమ్స్ లో అఖిల్ ని, పూజా హెగ్డేని కలిపి చూస్తే జోడీ సెట్ కాలేదన్న వార్తలు వస్తున్నాయి. ఒక ఫ్రేమ్ లో వాళ్ళిద్దరినీ చూస్తుంటే వదిన, మరిది లేదా అక్కా, తమ్ముళ్ళను చూసిన ఫీలింగ్ కలుగుతుంది.

నిజానికి అఖిల్ వయసు 26 ఏళ్ళు. ఇక పూజా హెగ్డే వయసు 30 ఏళ్ళు. ఏ విధంగానూ వీళ్ళ జోడీ సెట్ కాదని తెలిసిపోతుంది. ఒకవేళ ఏజ్ తో సంబంధం లేకపోయినా సినిమా కాబట్టి మేనేజ్ చేయచ్చు అనుకోవడానికి లేదు. ఎందుకంటే అఖిల్ ఈ మూవీలో మునుపటి సినిమాల్లో కంటే యంగ్ గా కనిపిస్తున్నారు. అసలే ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల పక్కన నటించి ముదురు హీరోయిన్ అయిపోయిన పూజా, లేలేత కుర్రాడిలా ఉన్న అఖిల్ పక్కన నిలుచుంటే జోడీ సెట్ కాలేదేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది.

అఖిల్ పక్కన పూజాని కాకుండా, తన కంటే చిన్న వయసు ఉన్న రష్మిక మందన్న, షాలిని పాండే వంటి హీరోయిన్స్ ను తీసుకుని ఉంటే జోడీ కరెక్ట్ గా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దర్శక, నిర్మాతలకి తెలీదా ఎవరిని పెట్టాలో, కథలో భాగంగా కావాలనే అఖిల్ కన్నా పెద్ద వయసున్న కేరెక్టర్ ని పెట్టారేమో, ఎవరికి తెలుసు? అని ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా టీజర్ ను చూసినప్పుడు మాత్రం వాళ్ళిద్దరి జోడీ సెట్ కాలేదన్న టాక్ అయితే నడుస్తుంది. మరి సినిమారిలీజయ్యాక ఈ టాక్ ను ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి.






మరింత సమాచారం తెలుసుకోండి: