ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ రాశి ఖన్నా తెలుగులో ఆమె వరుస ఛాన్సులు అందుకుంటుంది. యువ హీరోల సరసన నటిస్తున్న అమ్మడు ఎన్.టి.ఆర్ తో జై లవ కుశలో నటించినా సరే పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేదు. సినిమాలతో పాటు తన ఫోటో షూట్ లతో అలరించే రాశి ఖన్నా లేటెస్ట్ గా అచ్చతెలుగు అమ్మాయిగా శారీ లుక్ తో సర్ ప్రైజ్ చేసింది.

కట్టు బొట్టు తల్లో మల్లెపూలు చూస్తే రాశి ఖన్నా తెలుగు అమ్మాయిగా మారిపోయిందే అనేలా ఆమె లుక్ ఉంది. సినిమాల్లో ఎంత సందడి చేసినా రాశి ఫోటో షూట్స్ తో స్పెషల్ క్రేజ్ దక్కించుకుంది. లేటెస్ట్ గా ఆమె చేసిన ఈ ఫోటో షూట్ మరింత క్రేజ్ తెచ్చింది. ప్రతి మహిళలో శివ శక్తి ఉంటుంది అంటూ ఈ దసరా సందర్భంగా తన పిక్స్ తో అలరిస్తుంది అమ్మడు.

తెలుగుతో పాటుగా తమిళంలో కూడా రాశి ఖన్నా వరుస ఛాన్సులు అందుకుంటుంది. తెలుగు, తమిళ భాషల్లో దూసుకెళ్తున్న అమ్మడు స్టార్ క్రేజ్ దక్కించుకోవడంలో మాత్రం వెనకపడ్డది. అయితే చేతినిండా అవకాశాలు ఉన్నా సరైన క్రేజ్ తెచ్చుకోవట్లేదు ఈ అమ్మడు. స్టార్ సినిమా ఛాన్సుల కోసం వెయిట్ చేస్తున్న రాశి ఖన్నా రాబోయే రోజుల్లో మరింత క్రేజ్ తెచ్చుకోవాలని ఆశిద్దాం. రాశి ఖన్నా న్యూ లుక్స్ ఆమె ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తప్పకుండా అమ్మడు తన టార్గెట్ రీచ్ అవుతుందని మాత్రం చెప్పొచ్చు.                                                                        

మరింత సమాచారం తెలుసుకోండి: