స్మాల్ స్క్రీన్ పై సుధీర్ క్రేజ్ ఏంటన్నది అందరికి తెలిసిందే. జబర్దస్త్ లో ఓ కమెడియన్ గా చేస్తూ అతని కామెడీతో ఆడియెన్స్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సుధీర్ ఢీ షోలో టీం లీడర్ గా సత్తా చాటుతున్నాడు. స్మాల్ స్క్రీన్ పై సుధీర్ సూపర్ ఎంటర్టైనర్ గా నిలుస్తున్నాడు. అయితే స్మాల్ స్క్రీన్ పై సూపర్ ఎనర్జీతో టాలెంట్ చూపుతూ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న సుధీర్ సిల్వర్ స్క్రీన్ పై మాత్రం వెనకపడ్డాడు.

స్మాల్ స్క్రీన్ పై సుధీర్ ప్రతి షోతో సత్తా చాటుతుండగా వెండితెర మీద ఆ క్రేజ్ ఏమాత్రం యూజ్ అవట్లేదు. హీరోగా మొదటి సినిమా సాఫ్ట్ వేర్ సుధీర్, ఆ తర్వాత త్రీ మంకీస్ అంటూ ప్రయత్నాలు చేసినా సరే పెద్దగా వర్క్ అవుట్ అవలేదు. హీరోగా తన డ్రీం ఫుల్ ఫిల్ చేసుకునే క్రమంలో సుధీర్ కథల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో వెనకపడుతున్నాడు. సుధీర్ చేసిన రెండున్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి. ఇక చేయబోయే సినిమాలైనా సత్తా చాటేలా ఉంటాయో లేదో చూడాలి.

సుధీర్ కు మంచి ఫలఓయింగ్ ఉన్నా సరే ఆ క్రేజ్ సిల్వర్ స్క్రీన్ పై మాత్రం ఎందుకో ఫెయిల్ అవుతున్నాడు. కరెక్ట్ సినిమా పడితే సుధీర్ కూడా సిల్వర్ స్క్రీన్ పై క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. ఇన్నాళ్లు సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూ వచ్చిన సుధీర్ కథల విషయంలో జాగ్రత్తలు తీసుకుని సరైన సినిమా చేస్తే మాత్రం సూపర్ క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది.                                                          

మరింత సమాచారం తెలుసుకోండి: