అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జోడీగా శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వస్తున్న సినిమా లవ్ స్టోరీ. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వస్తున్న క్రేజీ మూవీగా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమాలో శేఖర్ కమ్ముల సాయి పల్లవి కాంబో కూడా క్రేజీగా మారింది.

సినిమా నుండి దసరా స్పెషల్ గా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. చైతన్య, సాయి పల్లవి కలిసి ఉన్న ఈ పోస్టర్ క్రేజీగా ఉంది. లవ్ స్టోరీ సినిమా యూత్ ఆడియెన్స్ ను పక్కా టార్గెట్ చేస్తూ ఈ సినిమా వస్తుంది. 2021 సంక్రాంతి కానుకగా ఈ సినిమాపై బజ్ బాగానే ఉంది.

ఇప్పటికే రిలీజైన సాంగ్స్ సినిమాపై క్రేజ్ తీసుకురాగా సినిమా అవుట్ పుట్ బాగా వచ్చిందని తెలుస్తుంది. అక్కినేని నాగ చైతన్య లాస్ట్ ఇయర్ మజిలీ, వెంకీమామ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నాడు. లవ్ స్టోరీ సినిమాతో కూడా ఆ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు. లవ్ స్టోరీ తర్వాత విక్ర కుమార్ డైరక్షన్ లో థ్యాంక్యూ సినిమా చేస్తున్నాడు నాగ చైతన్య. ఈ సినిమా హర్రర్ జానర్ లో వస్తుందని తెలుస్తుంది. తన సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు నాగ చైతన్య.. సాయి పల్లవి కూడా లవ్ స్టోరీతో పాటుగా వేణు ఊడుగుల డైరక్షన్ లో విరాట పర్వం సినిమాలో నటిస్తుంది. రానా హీరోగా వస్తున్న ఈ సినిమా డిఫరెంట్ స్టోరీతో రాబోతుందని తెలుస్తుంది.                                                                    

.  

మరింత సమాచారం తెలుసుకోండి: