బిగ్ బాస్ దసరా స్పెషల్ ఎపిసోడ్ లో సమంత సందడి చేసింది. అయితే సమంత ఒక్కతే హ్యాండిల్ చేస్తుందో లేదో అని ఆమెకు సపోర్ట్ గా అఖిల్ ను తెచ్చారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బొమ్మరిల్లు భాస్కర్ తో పాటు అఖిల్ బిగ్ బాస్ హౌజ్ లో సందడి చేశారు. అఖిల్ కొద్దిసేపు అలా హంగామా చేసి వెళ్లగా ఆ తర్వాత డిటెక్టివ్ గా హైపర్ ఆది వచ్చాడు.

బిగ్ బాస్ షోలో హైపర్ ఆది ఇది కొంచం నమ్మడానికి వీలు లేకున్నా సరే ఆది కూడా బిగ్ బాస్ షోలో కనిపించి సందడి చేశాడు. ఎప్పుడు తన స్కిట్స్ లో బిగ్ బాస్ మీద కామెడీ చేసే ఆది సడెన్ గా ఇలా టర్న్ తీసుకోవడం షాకింగ్ గానే ఉంది. అఖిల్ అయినా ఇలా వచ్చి అలా వెళ్ళాడు కాని ఆది వచ్చి అదరగొట్టేశాడని చెప్పాలి.

చెప్పాలంటే హోస్ట్ సమంత కన్నా రెగ్యులర్ గా షో ఫాలో అవుతున్నట్టుగా ఉన్న హైపర్ ఆది సమంత కన్నా షో మీద.. కంటెస్టంట్స్ మీద పంచులేశాడు. అందరి గురించి చెబుతూ వచ్చి ఆది అవినాష్ ను మా అవినాష్ అంటూ అతనికి సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. ఇంకా చెప్పాలంటే ఆది రావడం వల్ల అవినాష్ కు కొద్దిగా బూస్టింగ్ ఇచ్చినట్టు ఉందని చెప్పొచ్చు. ఫైనల్ గా ఆది బిగ్ బాస్ హౌజ్ లో సందడి అదిరిపోయిందని చెప్పొచ్చు.                                                                     

మరింత సమాచారం తెలుసుకోండి: