టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మరో సినిమా కూడా చేస్తున్న విషయం తెలిసిందే. కాగా వీటిలో ముందుగా ప్రారంభమైన వకీల్ సాబ్ ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకోగా దీనిని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేలా మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది. బడా నిర్మాతలు దిల్ రాజు, బోనీకపూర్ కలిసి ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా  పవన్ ఈ సినిమాలో పవర్ ఫుల్ లాయర్ పాత్రలో నటిస్తున్నారు.
ఇక దీనితో పాటు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ డ్రామా మూవీలో పవన్ ఒక వజ్రాల దొంగ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ రెండు సినిమాల అనంతరం హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఒక సినిమా అలానే ఆ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మించనున్న భారీ ప్రతిష్టాత్మక సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ నటించనున్నారు. ఇకపోతే నేడు దసరా పండుగ కానుకగా పవర్ స్టార్ నటించనున్న మరొక సినిమాకు సంబంధించిన న్యూస్ కూడా వచ్చింది. యువ నిర్మాత నగవంశీ ప్రొడ్యూసర్ గా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శరత్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి నేడు అధికారిక ప్రకటన రావడం జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమా ఇటీవల మలయాళంలో రిలీజ్ అయి మంచి సక్సెస్ కొట్టిన అయ్యప్పన్ కొషియం సినిమాకు అధికారిక తెలుగు రీమేక్ అని తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో పవర్ స్టార్ తో పాటు మరో నటుడిగా హీరో రానా ని కన్ఫర్మ్ చేసిందట మూవీ యూనిట్. ఈ సినిమాలో పవన్ పాత్ర తో పాటు రానా పాత్ర కూడా సమాంతరంగా సాగుతుందని, అలానే ఆ పాత్రకు కరెక్ట్ గా రానా మాత్రమే న్యాయం చేయగలడని భావించిన దర్శకనిర్మాతలు అతడిని ఎంపిక చేసినట్లు చెప్తున్నారు. ఇక రానా క్యారెక్టర్ కు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఇక పలు ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాని అత్యంత భారీ ఖర్చుతో నిర్మాత నాగవంశంశీ నిర్మించనుండగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఆ సినిమా కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా దర్శకుడు కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రారంభం కానున్న ఈ సినిమాని అదే ఏడాది దసరా కానుకగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తోందట మూవీ యూనిట్..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: