సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌ పై నితిన్ , కీర్తి సురేష్ జంటగా ఈ 'రంగ్ దే' మూవీ తెరకెక్కుతోంది. 'తొలిప్రేమ', 'మజ్ను' వంటి ప్రేమ కథాచిత్రాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా.. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్ని సినిమాల లాగానే ఈ సినిమా కూడా కరోనా వైరస్ వలన విధించిన లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌ కొన్ని నెలలుగా ఆగిపోయింది. అయితే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమా షూటింగ్ మొన్ననే హైదరాబాద్‌ లో ప్రారంభమైంది. అలానే ఈ సినిమా షూట్ మొదలయిన కొత్తలో 2021 సంక్రాంతికి రంగ్ దే మీ ముందుకు వస్తోందని క్లారిటీ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా ఈ రంగ్ దే కూడా డిజిటల్ రిలీజ్ కి వెళుతుందని ఊహాగానాలు ఉన్నాయి.

అయితే ఆ క్లారిటీ ఇవ్వడంతో కొంత ఆ ప్రచారం ఆగింది అనుకోండి. అయితే  విశ్వసనీయ వర్గాల సమాచారం ఏమిటంటే నితిన్ మార్కెట్‌ను పరిగణనలోకి తీసుకుని జీ5 సంస్థ ఈ సినిమాకి 28 కోట్లు కోట్ చేసింది, అయితే మేకర్స్ మాత్రం 40 కోట్లు డిమాండ్ చేసినట్టు సమాచారం. అందుకే ఈ డీల్ ఇంకా లాక్ కాలేదని అన్నారు. మళ్ళీ ఏమయిందో ఏమో కానీ మళ్ళీ ఈ సినిమా ఓటీటీకి వెళుతుందని అంటున్నారు.  పే-పర్-వ్యూ ప్రాతిపదికన ఈ చిత్రాన్ని విడుదల చేయాలని వారు యోచిస్తున్నారు. జీ ప్లెక్స్ ద్వారా ఈ సినిమాని రిలీజ్ చేయాలనీ యోచిస్తున్నట్టు చెబుతున్నారు. ప్రేక్షకులు సినిమాను చూడటానికి టోకెన్ టికెట్ ధర చెల్లించాలి.

అయితే దీని గురించి మేకర్స్ ఇంకా అధికారిక ప్రకటన ఏదీ చేయలేదు. రామ్ గోపాల్ వర్మ తన తక్కువ బడ్జెట్ చిత్రాలకు ఈ మోడల్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఈ సినిమా టాకీ పార్ట్ చాలా వరకు పూర్తయింది. కొన్ని సన్నివేశాలు, పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ లాంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: