మొదట్లో చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ అవగా ఆమెను కరెక్ట్ గా వాడుకుంటే అద్భుతాలు చేఒచ్చని హరీష్ శంకర్ డిజేతో ఆమెను బికినిలో చూపించాడు హరీష్ శంకర్. ఆ సినిమాలో అమ్మడి హాట్ లుక్స్ కు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. అప్పటి నుండి ఆమెకు వరుస ఛాన్సులు వస్తున్నాయి. వరుస స్టార్స్ తో క్రేజీ ఛాన్సులు అందుకుంటున్న పూజా హెగ్దే ఆడియెన్స్ లో అదిరిపోయే ఫాలోయింగ్ ఏర్పరచుకుంది.

అందుకే ఆమెకు సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. ఈ ఇయర్ మొదట్లోనే అల వైకుంఠపురములో సినిమాతో హిట్ అందుకున్న పూజా హెగ్దే బుట్ట బొమ్మగా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. అందుకే ఆమె వెంట క్రేజీ ఫాలోవర్స్ కూడా ఉన్నారు. లేటెస్ట్ గా పూజా హెగ్దే ఇన్ స్టాగ్రాం కు 12 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు.

సౌత్ స్టార్ హీరోయిన్స్ లో కొద్దిమంది హీరోయిన్స్ తో పాటుగా పూజా హెగ్దే ఈ రికార్డ్ అందుకుంది. పూజా హెగ్దే ఒక మెసేజ్ పెడితే అది 12 మిలియన్ పీపుల్ కు రీచ్ అవుతుంది. తెలుగులో స్టార్ సినిమా అంటే చాలు ముందు పూజా హెగ్దేకే మొదటి ఛాన్స్ ఇస్తున్నారు. ఆమె కూడా ఇక్కడ వరుస సినిమాలు చేస్తుంది. మరి అమ్మడు ఈ ఫాం మరికొన్నాళ్లు కొనసాగించేలా ఉంది. ప్రస్తుతం అఖిల్ బ్యాచిలర్ సినిమాతో పాటుగా ప్రభస్ రాధే శ్యాం సినిమాలో కూడా ఆమె నటిస్తుంది.                                                                



మరింత సమాచారం తెలుసుకోండి: