ఆరేడేళ్ల జబర్దస్త్ ప్రస్థానానికి గండి పడేలా ఉంది. ఆ షోతో సూపర్ పాపులర్ అయిన వారు ఇప్పుడు ఆ షో నుండి చిన్నగా ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. జబర్దస్త్ తో కొన్నాళ్లుగా కలిసి పనిచేసిన డైరక్టర్స్ ఇద్దరు జీ తెలుగుకి వచ్చి అదిరింది షో చేస్తున్నారు. నాగబాబు కూడా వారితో వచ్చేశాడు. చమ్మక్ చంద్రతో పాటు ఒకప్పుడు జబర్దస్త్ ను నిలబెట్టిన వేణు, ధన్ రాజ్ లు ఈ షో చేస్తున్నారు.

ఇక లేటెస్ట్ గా జబర్దస్త్ నుండి అవినాష్ కూడా అక్కడ ఎగ్జిట్ అయ్యి బిగ్ బాస్ లో ఎంటర్ అయ్యాడు. బిగ్ బాస్ హౌజ్ లో జోకర్ గా అవినాష్ తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటున్నాడు. ఓ విధంగా బిగ్ బాస్ హౌజ్ లో అవినాష్ కామెడీ అతనికి సూపర్ క్రేజ్ తెచ్చిందని చెప్పాలి. జబర్దస్త్ వల్ల కానిది బిగ్ బాస్ వల్ల అయ్యిందని ప్రూవ్ అయ్యింది. ఇక ఇదిలాఉంటే ఇదివరకు జబర్దస్త్ స్టార్స్ అంతా ఈటివి స్పెషల్ ఎపిసోడ్స్ లోనే కనిపించే వారు. కాని ఇప్పుడు సీన్ మారినట్టు ఉంది.

దసరా స్పెషల్ గా స్టార్ మాలో జబర్దస్త్ కమెడియన్స్ కొందరు సందడి చేశారు. స్టార్ మా దసరా స్పెషల్ జాతతో జాతరలో భాస్కర్, సుధాకర్, నరేష్ లు అలరించగా ఏకంగా బిగ్ బాస్ షోలో సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చాడు హైపర్ ఆది. బిగ్ బాస్ మీద బోలెడు పంచులేసిన ఆది బిగ్ బాస్ షోకి రావడంపై అందరు షాక్ అవుతున్నారు. జబర్దస్త్ లో ఏదో జరుగుతుంది కాబట్టే వీరంతా బయట ఆఫర్లు వెతుక్కున్నట్టు తెలుస్తుంది. ఇలాంటి టైం లోనే వీరితో స్టార్ మా పెద్ద స్కెచ్ వేసిందని చెప్పొచ్చు.                                        

మరింత సమాచారం తెలుసుకోండి: