మనలో చాలా మంది రోడ్డు మీద ఉన్న ఏ హోటల్ కో, లేదా ఏ కాఫీ షాప్ కో వెళ్తారు. ఎక్కువ మంది సామాన్యులు వెళ్ళేది రోడ్డు మీద ఉండే వాటికే. రిచ్ కిడ్స్ లా కోల్డ్ కాఫీ 150 రూపాయలు పెట్టి తాగలేరు కదా. అందుకే రోడ్డు మీద తాగడానికి మనసు వస్తుంది. జేబులోంచి 10 రూపాయల నోటు కూడా ఏ మాత్రం బాధపడకుండా వస్తుంది. ఇకపోతే కాఫీ ఇచ్చే హోటల్ వాడు బాగుంటాడు, వాడి దగ్గర మామూలు తీసుకునే పోలీసోడు బాగుంటాడు. కాఫీ తాగినోడు మాత్రం అన్యాయం అయిపోతాడు. ఎందుకంటే బండి రోడ్డు మీద పార్క్ చేసినందుకు. ఏమన్నా అంటే నో పార్కింగ్ బోర్డు చూడలేదా? ఇచ్చట వాహనాలు నిలుపరాదు అని పోలీసోడు అంటాడు.

నాకర్ధం కాదు, నో పార్కింగ్ బోర్డు పెట్టారు సరే, ఇరుకు రోడ్డులో ట్రాఫిక్ అవుతుందని తెలిసి కాఫీ షాపులు, హోటల్స్  కి పర్మిషన్ ఎందుకిస్తారు. చిన్న చిన్న హోటల్స్, టీ పాయింట్స్ దగ్గర పార్కింగ్ ప్లేసులు ఉండవు. సామాన్యులు పెద్ద హోటల్స్ కి, పెద్ద పెద్ద కాఫీ షాపులకి వెళ్లలేరు. ఇంక టిఫిన్ లు, కాఫీలు మానేయాలా? ఇదెక్కడి అన్యాయం. బండ్లు ఎక్కడైనా దూరంగా పార్క్ చేసి నడుచుకుంటూ రావాలా? ఎప్పుడు చూసినా సామాన్యుడి సరదానే తీరుస్తున్నారు, కానీ ఒక్కరైనా సామాన్యుడి ఇక్కట్లు అర్ధం చేసుకుంటున్నారా?

వర్క్ టెన్షన్ తట్టుకోలేక కాసేపు టీ షాప్ లో కూర్చుని రిలాక్స్ అవుతూ టీ తాగుదామని వస్తే ట్రాఫిక్ వెహికల్ వాడు వస్తాడు. పాపం టీ గబగబా తాగేసి, ఒక్కోసారి మధ్యలో పారబోసేసి, టిఫిన్ మద్యలో వదిలేసి బండి స్టార్ట్ చేసి భయంభయంగా వెళ్లిపోతారు. కొంతమంది ట్రాఫిక్ వాడు వచ్చాడని తెలియక బండ్లు  స్టేషన్ కు వెళ్ళి తెచ్చుకుంటారు. పరువుగా బతికే సామాన్యులకి ఏంటి ఈ పంచాయితీ. ఇలాంటి ఘటనలు మహానగరాల్లో మామూలే. హైదరాబాద్ లో ఐతే ఇలాంటి ఘటనలు ఎన్నో చూశాను. నేను కూడా పడ్డాను ఈ బాధలు.

ఎవరిది తప్పు? పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేయని వ్యాపారులదా?  లేక ఈ వ్యాపారులకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వందా? తప్పెవరిదైనా సామాన్యులే బలైపోతున్నారు. నాకు అర్ధమైంది ఏంటంటే, సామాన్యుడు రోడ్డు మీద ఆహార పదార్ధాలు తిని ఆరోగ్యం పాడుచేసుకోకూడదని, చచ్చినట్టు పెద్ద పెద్ద హోటల్స్ లనే టిఫిన్లు, టీలు తీసుకోవాలని భావిస్తున్నట్టున్నాయ్ ఈ ప్రభుత్వాలు. అయినా ఇప్పుడెందుకు ఈ విషయం వచ్చింది అంటే, సుశాంత్ హీరోగా నటిస్తున్న "ఇచ్చట వాహనములు నిలుపరాదు" అనే మూవీకి సంబంధించి పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ని చూస్తే నాకు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ గుర్తుకొచ్చాయి. అదండి విషయం. మరి ఆ సినిమాలో డైరెక్టర్ ఈ పాయింట్ ని టచ్ చేస్తారో లేదో చూడాలి. టచ్ చేస్తే కనీసం ఈ విషయం గవర్నమెంట్ దృష్టికైనా వెళ్తుంది కదా. చూద్దాం ఏం జరుగుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: