టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే ఆయన ఫ్యాన్స్ ని కదిపితే చాలు. అది కాక ఆయన సినిమాల కలెక్షన్స్ విషయం కూడా దీనిని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూ ఉంటుంది. అదే కాక టెలీవిజన్ ఆయన సినిమాల రేటింగ్లు చెక్ చేస్తే ఆ మార్కెట్ లో ఆయనకు ఉన్న క్రేజ్ చూసి పిచ్చెక్కి పోవాల్సిందే. శాటిలైట్ రైట్స్ రూపంలో పెట్టినదానికి నాలుగింతలు సంపాదించి పెడుతున్నాయట మహేష్ బాబు సినిమాలు.

 ఈ విషయం మళ్ళీ మళ్ళీ ప్రూవ్ అవుతూనే ఉంది. మహేష్ సినిమాలకు ముందు నుంచే ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. ఆరోజుల్లో ఆయన నటించిన అతడు సినిమాను మా టీవి 3.5కోట్లకు రైట్స్ దక్కించుకుని యాడ్స్ రూపంలో అంతకు నాలుగింతలు వసూల్లు చేసినట్లు చెబుతుంటారు. మాటీవీలో అతడు ప్రసారం అయిన ప్రతి సారి మహేష్ కున్న టెలీవిజన్ మార్కెట్ అర్ధం అవుతోంది. ఈ మధ్య కూడా తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమా జెమిని టీవీలో ప్రసారమై 12.55 రేటింగ్ తో సెన్పేషన్ క్రియేట్ చేసింది.

ఎందుకంటే ఇది ప్లే కావడం మూడో సారి మరి. ఈ సినిమాని రిలీజ్ కు ముందే జెమిని యాజమాన్యం 14 కోట్లు వెచ్చించి మరీ శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకుంది. జెమినీలో ప్రసారమయ్యే సమయానికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిపోయింది. దీంతో మెజారిటీ యూత్ అప్పటికే సినిమాను చూసేశారు. అయినా ఈ సినిమాని ఎప్పుడు టెలీకాస్ట్ చేసినా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: