జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమరం భీమ్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల దీనికి సంబంధించిన టీజర్ ని కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక ఈ సినిమా టీజర్ కి సంబంధించి ఇప్పుడు వివాదం రేగింది. ఆర్.ఆర్.ఆర్ మూవీ టీజర్ లో కొమురం భీం పాత్రను వక్రీకరించారని కొంత మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఒక షాకింగ్ గాసిప్ బయటకు వచ్చింది.

అదేంటంటే ఈ సినిమా కూడా మగధీర లాగా పునర్జన్మల నేపధ్యంలో ఉండనుందని అంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ యూనిట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్‌ను తిరిగి ప్రారంభించింది కూడా. ముందు ప్రకటించినట్టుగానే అక్టోబర్ 22 న తారక్ టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్ విడుదలైనప్పటి నుండి, ఆర్.ఆర్.ఆర్ కథకు సంబంధించి అనేక చర్చలు జరిగాయి. ఎన్ని వివాదాలు వస్తున్నా ఆర్.ఆర్.ఆర్ పూర్తిగా కల్పితమైనదని మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేశారు.

 1920వ దశకంలో ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతా రామ రాజు మరియు కొమురం భీమ్ కలిసే నేపథ్యంలో ఇది సెట్ చేయబడింది. అయితే రెండు టీజర్లలోనూ తారక్ మరియు చరణ్ యొక్క వేర్వేరు లుక్స్ ని కూడా చూపించారు. అందుకే ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమాలో రెండు కాలక్రమాలు ఉన్నాయని, తారక్ మరియు చరణ్ రెండూ ద్వంద్వ షేడ్స్‌లో కనిపిస్తారని కొత్త ఊహాగానాలు మొదలవుతున్నాయి. అంటే ఇద్దరూ ఒక లుక్ లో కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజుగా మరో లుక్ ఓ చరణ్ ఒక బాక్సర్ గా ఎన్టీఆర్ ఓ ముస్లిం యువకుడిగా నటిస్తున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: