ఒకప్పటి ఈ బిజీ హీరోకి ఇప్పుడు పెద్దగా అవకాశాలు లేవు...అయితే లేక లేక ఒక ఛాన్స్ వస్తే నో అన్నాడట.. అందులోనూ ఆ ఆఫర్ త్రివిక్రమ్ నుండి రావడం...ఆయన ఇచ్చిన అవకాశాన్నే కుదరదు అని చెప్పేసాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు ఒకప్పుడు కుర్రకారును ఉర్రూతలూగించిన మన మిల్కీ బాయ్ తరుణ్. ఈ యంగ్ హీరో ఫిల్మ్ బయోడేటా గురించి అందరికీ తెలిసిందే... చిన్నతనంలోనే యాక్టింగ్ మొదలుపెట్టిన ఈ కుర్రాడు.... పెద్దయ్యాక తన టాలెంట్ తో పెద్ద హీరోగా ఎదిగాడు.... పేరు కి గొప్ప ప్రతిభావంతుడే..... అప్పట్లో అగ్రహీరోల సినిమాలకు సైతం పోటీ ఇవ్వగల ధీరుడే అయితే అనుకోకుండా కొన్ని పరిణామాల వలన హఠాత్తుగా అతడి కెరీర్ డైలమాలో పడిన విషయం తెలిసిందే... సినీ జీవితం అన్న తర్వాత ఓడలు బళ్ళు ....బళ్ళు ఓడలు అవడం చూస్తూనే ఉంటాం.

హీరో గా సినీ పరిశ్రమను వీడి చాలా కాలం అవుతున్నా...మళ్లీ హీరోగా తెరపై కనిపించడానికి తరుణ్ చేయని ప్రయత్నం లేదు... ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాడు. అలాంటిది అతడికి త్రివిక్రమ్ రూపంలో ఓ అవకాశం దొరికిందట. 2020 బ్లాక్ బస్టర్ మూవీ `అల వైకుంఠపురములో` చిత్రంలో సుశాంత్ కి ఆఫర్ చేసిన పాత్ర కోసం తొలుత తరుణ్ ని ఓకే చేసి... తరుణ్ ని సంప్రదించారట. కానీ అందులో నటించేందుకు తరుణ్ ఆసక్తి చూపించలేదని తెలిసింది. ఆ పాత్ర అంత ఆసక్తికరంగా లేకపోవడంతో.... సినిమాలో పెద్ద ప్రాముఖ్యత చూపే పాత్ర కాకపోవడంతో.... రిజెక్ట్ చేశాడట తరుణ్. ఈ ఆఫర్ని వదులుకున్న తరుణ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో చేసే ఇంట్రెస్ట్ తనకు లేదని చెప్పకనే చెప్పాడు. అయితే తరుణ్ మళ్లీ హీరో గా వచ్చే అవకాశం ఉందా అన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సూపర్ టాలెంటెడ్ హీరోనే కనుక మంచి కథ దొరికితే తిరిగి పట్టాలెక్కే అవకాశం లేకపోలేదు..... కానీ దారి చూపే దెవరు...??? సినిమా ఇచ్చేదెవరు..???

అప్పట్లో తరుణ్ డెబ్యూ బ్లాక్ బస్టర్ నువ్వే కావాలి చిత్రానికి త్రివిక్రమ్ రచయిత. అది ఎంత గొప్ప విజయాన్ని సాధించిందో విదితమే.
అలాగే తరుణ్ నటించిన `నువ్వే నువ్వే` సినిమాకి త్రివిక్రమ్ కి దర్శకుడిగా పని చేశాడు. అలాంటి అనుబంధం ఆ ఇద్దరి మధ్య ఉంది. కాబట్టి ఈసారి  త్రివిక్రమ్ ఏదైనా మంచి కథతో హీరోగా తరుణ్ ని సెలెక్ట్ చేస్తాడేమోనని, కలిసి పని చేసే అవకాశం ఉందేమో అందరూ ఆశపడుతున్నారు..... మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో వేచి చూడాలి. ఒకవేళ తరుణ్ కనుక కం బ్యాక్ అయితే మళ్లీ తారాజువ్వలా దూసుకుపోతాడు అని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: