‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలోని జూనియర్ కొమరం భీమ్ పాత్రకు సంబంధించిన టీజర్ విడుదల కావడంతో ఈమూవీలో జూనియర్ చరణ్ ల లుక్స్ ఎలా ఉంటాయి అన్నవిషయమై క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తి అయి వచ్చే ఏడాది విడుదల   అవుతుంది అన్నవిషయమై జూనియర్ చరణ్ లతో పాటు రాజమౌళికి కూడ క్లారిటీ లేదు అన్నప్రచారం జరుగుతోంది.


దీనితో ఈసినిమాలో ఎన్టీఆర్ చరణ్ లు ఇద్దరూ కూడ తమ తదుపరి ప్రాజెక్టుల విషయంలో తమ వద్దకు వస్తున్న వారికి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేక పోతున్నారని తెలుస్తోంది. ఈ షూటింగ్ పూర్తి చేసుకున్న వెంటనే త్రివిక్రమ్ సినిమా మొదలుపెడతాడు అన్న ఆశతో త్రివిక్రమ్ నెలలు తరబడి ఎదురు చూస్తున్నాడు.


ఇలాంటి పరిస్థితులలో రాజమౌళి జూనియర్ చరణ్ లకు ఈసినిమాకు సంబంధించి ఒక కొత్త కండిషన్ పెట్టినట్లు మాటలు వినిపిస్తున్నాయి. ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ పూర్తి అయినప్పటికీ చరణ్ జూనియర్ లు తమ గెటప్స్ మార్చుకోకూడదని అవసరం అనుకుంటే కొన్ని సీన్స్ రీ షూట్ చేయడానికి లేదంటే ఈమూవీ విడుదలకు ముందు చరణ్ జూనియర్ లను ప్రమోషన్ టూర్ కు తీసుకు వెళ్ళవలసి వస్తుంది కాబట్టి చరణ్ జూనియర్ లు ఈ సినిమా కోసం ఏర్పరుచుకున్న తమ లుక్ ను ఈ మూవీ విడుదల అయ్యేదాకా అలాగే ఉంచాలి అని కోరిక రూపంలో ఉన్న తన కండిషన్ ను బయట పెట్టినట్లు టాక్.


దీనితో రాజమౌళి నోటివెంట వచ్చిన ఈ ఊహించని కండిషన్స్ కు చరణ్ జూనియర్ లు పూర్తిగా కన్ఫ్యూజ్ అవుతున్నట్లు టాక్. జక్కన్న మాటల ప్రకారం చరణ్ జూనియర్ లు నడుచుకోవలసి వస్తే ఈమూవీ విడుదల అయ్యేదాకా వీరిద్దరికీ మరొక సినిమా చేసే ఆస్కారం లేదు అనుకోవాలి. ఈ వార్తలే నిజం అయితే త్రివిక్రమ్ జూనియర్ కోసం ఇక వేచి చూసే సాహసం చేయకపోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: