బుల్లితెరపై తనదైన శైలిలో దూసుకెళ్తున్న షో బిగ్ బాస్. ఈ షో విజయవంతగా మూడు సీజన్స్ ని కంప్లిట్ చేసుకొని నాల్గో సీజన్ లో అడుగుపెట్టింది. ఈ సీజన్స్ కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందుతుంది. ఈ షోకి న‌ట‌నా సామ్రాజ్య‌పు మ‌హారాణి, సిరివెన్నెల విర‌బోణి స‌మంత బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో ద‌స‌రా స్పెష‌ల్ మ‌హా ఎపిసోడ్‌కు వ్యాఖ్యాత‌గా వ్య‌హ‌రించింది. ఇక సమంత ముద్దు ముద్దు మాట‌ల‌తో షో ప్రారంభం నుంచే సంద‌డి మొద‌లు పెట్టేసింది. కంటెస్టెంట్లు ఒక్కొక్క‌రి గురించి స‌మంత త‌న అభిప్రాయాల‌ను చ‌క్క‌గా చెబుతూనే అంద‌రినీ తిక‌మ‌క పెట్టింది ఈ భామ.

బిగ్ బాస్ హౌస్ లో 7వ వారం దివి ఎలిమినేషన్ అనేది కొంతమందికి అన్ ఫెయిర్ గా అనిపించినా.. ఓటింగ్ ప్రకారమే దివిని ఎలిమినేషన్ జరిగిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అసలు దివి హౌస్ లో ఏం చేసింది.? ఎందుకు దివి ఎలిమినేట్ అవ్వకూడదు అని కూడా బిగ్ బాస్ లవర్స్ ప్రశ్నిస్తున్నారు. ఫస్ట్ వీక్ లో హౌస్ మేట్స్ అందరి మనస్తత్వాలు కాచి వడబోసింది తప్పితే, తన గేమ్ ఏంటి అనేది ఆలోచించలేకపోయింది దివి.

ఇక హౌస్ మేట్స్ అందరితో కంటే అమ్మతోనే ఎక్కువగా ఉంది దివి. అంతేకాదు, అమ్మగేమ్ ని కూడా చాలాసార్లు ఇన్ఫులెన్స్ చేసింది కూడా. ఇక తనని లాస్ట్ వీక్ నామినేట్ చేసిన లాస్య కోసం తను శాక్రిఫైజ్ చేసి మరీ నామినేషన్స్ లోకి వచ్చింది. ఇది ఆడియన్స్ కి నచ్చుతుందిలే అని లైట్ తీస్కుంది. కానీ, ఆడియన్స్ కూడా ఓట్లు వేయడంలో లైట్ తీస్కుంటారని గెస్ చేయలేకపోయింది. ఇక హౌస్ మేట్స్ గురించి అనవసరంగా మాట్లాడిన మాటలు కూడా దివికి మైనస్ అయ్యాయి

నీ త‌ర్వాతి సినిమాలో దివికి ఓ మంచి పాత్ర ఇవ్వు అంటూ స‌మంత షోకు విచ్చేసిన కార్తికేయ‌ను అభ్య‌ర్థించ‌గా అత‌డు ఓకే చెప్పాడు. మ‌రి మీతో ఒక సినిమా చేయాల‌నుంది అని కార్తికేయ మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్ట‌గా సామ్ అందుకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేసింది. ఇక‌ వారం రోజుల పాటు ఒక్క‌రే వంట చేయాల‌న్న బిగ్‌బాంబ్‌ను దివి లాస్య‌పై వేసింది. త‌న‌కు అసిస్టెంటుగా లాస్య అభిజిత్‌ను ఎన్నుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: