మొత్తానికి బిగ్ బాస్ తాను అనుకున్నట్లుగానే కధ నడిపిస్తున్నాడు. బిగ్ బాస్ లో 16 మంది కంటెస్టెంట్లతో షో మొదలెట్టారు. అందరిలోనూ సీనియర్ గా గంగవ్వను తెచ్చి మరీ స్పెషల్ అన్నారు. ఇక మరో ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చారు. ఇవన్నీ ఇలా ఉంటే ప్రేక్షకులు ఓటు చేస్తూ తమకు నచ్చని వారిని ఇంటికి పంపించేందుకు తెగ ఆరాటపడుతున్నారు. అయితే బిగ్ బాస్ మీద ఈ విషయంలో మాత్రం ఒక రేంజిలో ఆరోపణలు వస్తున్నాయి. స్ట్రాంగ్ కంటెస్టెంట్లను వరసబెట్టి మరీ  బిగ్ బాస్ హౌజ్ నుంచి ఇంటికి పంపుతున్నారని  అంటున్నారు.

ఇప్పటిదాకా జరిగిన ప్రతి ఎలిమినేషన్ కూడా వివాదాస్పదనే అయిందని అంటున్నారు. ఈ వారం తప్పకుండా ఫలానా వారు ఎలిమినేట్ అవుతారు అని వారు ఆట తీరును బట్టి ఆడియన్స్ అంచనాకు వస్తున్నారు. ఓట్లు కూడా అలాగే వేస్తున్నారు. కానీ బిగ్ బాస్ వేరొకరిని హౌజ్ నుంచి పంపుతున్నారు. దాంతో ఓటింగ్ కంటే రేటింగ్ ముఖ్యమా అన్న చర్చ కూడా వస్తోందిట.

ఈ వారం దెఫినిట్ గా మోనాల్ గజ్జర్ హౌజ్ నుంచి అవుట్ అని అంతా భావిస్తే దివిని బయటకు పంపేశారు. దీని మీద అపుడే విమర్శలు మొదలయ్యాయి. ఇవన్నీ ఇలా ఉంటే ఇక 11 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వీరిలో అమ్మ రాజశేఖర్ అరగుండు కొట్టించుకుని గత వారం నామినేషన్ నుంచి తప్పించుకున్నారు. ఈ వారం కచ్చితంగా ఆయన నామినేషన్ లోకి వస్తారు. ఆయన్నే ఈ వారం ఇంటికి పంపుతారు అన్న టాక్ అయితే వచ్చేసింది.

అంటే బిగ్ బాస్ లో ఇపుడు నాలుగు జంటలు ఉన్నాయి. నోయల్. లాస్యను పక్కన పెడితే వీరి నుంచే లవ్ ట్రాక్ నడిపించి కావాల్సిన మసాలా రాబట్టాలని బిగ్ బాస్ ఆశిస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే బిగ్ బాస్ మార్క్ షో ఈ సీజన్ లో కనిపిస్తోందని అంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: