దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు అంటే అదోరకం క్రేజ్. ఆయన సినిమాను సినిమాగానే చూశారు. అలాగే సినిమాలు తీశారు. సామాన్యుడికి ఇది సాధ్యమా అంటే కలలు నెరవేరని వారే సినిమాను చూసి ఆత్మానందం పొందుతారు కాబట్టి ఏ లాజిక్కులూ లేకుండా మ్యాజిక్కులతో సినిమా తీస్తే తప్పేంటి అన్నది రాఘవేంద్రుడి థియరీ. ఆయన శతాధిక చిత్రాలను తీసిన మేటి. ఓ వైపు వరసపెట్టి రక్తి సినిమాలు తీసిన చేతితోనే మరో వైపు భక్తి చిత్రాలను కూడా ఆయన తీసి తనకు సాటి వేరొకరు లేరు అనిపించుకున్నాడు. రాఘవేంద్రరావు దాదాపు మూడేళ్ల తరువాత మెగా ఫోన్ పట్టి కొత్త సినిమా తీయబోతున్నారు అని ఈ మధ్య న్యూస్ వచ్చింది.

అది కూడా 23 ఏళ్ల క్రితం నాటి  పెళ్ళిసందడి మూవీ అని కూడా ప్రచారం చేశారు. ఆ మూవీ న్యూస్  అలా ఉండగానే ఇపుడు మరో కొత్త న్యూస్ వచ్చింది. అదేంటి అంటే ఈ లేటు వయసులో అదీ 78 ఏళ్ళ వయసులో రాఘవేంద్రరావు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారని, ఆయన పక్కన ముగ్గురు ముద్దు గుమ్మలు ఆడిపాడుతారని. నిజంగా ఇది వినేందుకే షాకింగ్ గా ఉంది. కానీ అక్కడ ఉన్నది రాఘవేంద్రరావు తనదైన మాయాజాలంతో ఎంతోమందిని హీరోలుగా చేసి చూపించిన ఘనుడు ఆయన.

మరి ఆయన్ని ఆయన హీరోగా చేసుకోలేరా. అందుకే ఈ వార్త బయటకు రావడంతోనే నిజం అవ్వాలనే అంతా కోరుకున్నారు తప్ప రాఘవేంద్రుడు వల్ల కాదు అని మాత్రం ఎవరూ అనలేదు. దటీజ్ హిజ్ కెపాసిటీ. సో ఇపుడు రాఘవేంద్ర రావు ఆ నిర్మాణ పనులలో బిజీగా ఉన్నారుట. ఆయన పక్కన నటించే ముద్దుగుమ్మలు ఎవరా అంటే ఒకనాటి టాప్ హీరోయిన్స్ రమ్య క్రిష్ణ, త్రిష, శ్రియలట. అంటే మన రాఘవేంద్రుడు హీరోగా మారి ఈ ముగ్గురు ముద్దు గుమ్మలతో  ఆడి పాడతారు అన్న మాట. ఇది కనుక సినిమాగా వస్తే చూసేందుకు ఆడియన్స్ రెడీ అంటున్నారు. ఇప్పటి నుంచే అలా క్యూరియాసిటీని పెంచే న్యూస్ గా ఇది ఉంది. ఇక రాఘవేంద్రరావు మూవీలో హీరో ఎలా ఉంటాడో అలాగే ఆయన కూడా ఉంటారట. అంటే విగ్గు పెట్టి డ్యూయేట్లు పాడుతూ కమర్షియల్  హీరోగా ఆయన మన ముందుకు వస్తారా. వెయిట్ అండ్ సీ.


మరింత సమాచారం తెలుసుకోండి: