బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హాట్ బ్యూటీ రాధిక ఆప్టే కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓవైపు నటన పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ మరోవైపు తన అందాలతో కూడా ప్రేక్షకులను మైమరపింప చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి క్రేజ్ వున్న స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది ఈ ముద్దుగుమ్మ. అయితే కేవలం సినిమాల ద్వారానే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా ఎంతో క్రేజ్ సంపాదించింది రాధిక ఆప్టే. ఏ విషయాన్ని కూడా మనస్సులో దాచుకోకుండా మొహం మీదే మాట్లాడుతూ ఉంటుంది. అందుకే ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.



 అయితే ఎక్కువగా సినిమాలలో  బోల్డ్  పాత్రలలో  చేస్తూ ప్రేక్షకులను తెగ ఆకర్షిస్తూ మతి పోగొడుతూ ఉంటుంది రాధిక ఆప్టే. అయితే సినిమాల్లో క్యారెక్టర్ లాగానే నిజజీవితంలో ఆమె మాటలు కూడా ఎంతో బోల్డ్  గానే ఉంటాయి. ఇక తెలుగులో రక్త చరిత్ర ధోని లెజెండ్ లయన్ లాంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గర అయిన ఈ ముద్దుగుమ్మ.  ఇప్పుడు కేవలం బాలీవుడ్కు మాత్రమే పరిమితం అయిన విషయం తెలిసిందే. ఇక 2012లో బ్రిటిష్ మ్యూజిషియన్ బెనెడిక్ట్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న హాట్ బ్యూటీ రాధిక ఆప్టే భర్తతో కలిసి ప్రస్తుతం లండన్లో స్థిరపడి పోయింది అనే విషయం తెలిసిందే.



 ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే మళ్లీ భారత్ కు వచ్చి సినీ కెరీర్ కోసం భారత్లోనే ఉంటుంది. ఏది ఉన్నా ముఖం మీద  మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసే రాధిక ఆప్టే ఇక తాజాగా తన పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు పెళ్లి చేసుకోవడం అంటే అస్సలు ఇష్టం లేదని కనీసం నమ్మకం కూడా లేదు అంటూ చెప్పుకొచ్చింది... కానీ విదేశీ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే వీసా సులభంగా వస్తుంది అన్న ఉద్దేశంతోనే బెనిడిక్ట్ ను వివాహం చేసుకున్నట్లు చెప్పుకొచ్చింది రాధిక ఆప్టే. అయితే తన భర్తతో ప్రస్తుతం ఎంతో సంతోషంగానే ఉన్నానని ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన దృష్టి మొత్తం తన కెరీర్ పైనే  అంటూ తెలిపింది

మరింత సమాచారం తెలుసుకోండి: